Jailer Movie Records: రజనీకాంత్ జైలర్ సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద రికార్డులను నమోదు చేసుకుంటోంది. నెల్సన్ దిలీప్ కుమార్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ జైలర్ ముత్తువేల్ పాండియన్‌గా నటించారు. దీనిని సన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో కళానిధి మారన్ నిర్మించారు. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో రమ్య కృష్ణన్, తమన్నా భాటియా, వినాయకన్, యోగి బాబు, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా సాధించిన అతి పెద్ద రికార్డులు ఏవో ఒకసారి చూసేద్దాం.
– 2023లో అతిపెద్ద తమిళనాడు ఓపెనర్
రజనీకాంత్ జైలర్ 2023లో అతిపెద్ద తమిళనాడు ఓపెనర్‌గా నిలిచింది ఈ సినిమా.
– కోలీవుడ్‌లో ఆల్ టైమ్ మూడో బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ ఓపెనర్
కోలీవుడ్ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద ఓపెనర్‌గా తన స్థానాన్ని దక్కించుకుంది ఈ సినిమా.
– USAలో 2023లో అతిపెద్ద భారతీయ ప్రీమియర్
USAలో 2023లో అతిపెద్ద భారతీయ ప్రీమియర్ సినిమాగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది రజనీకాంత్ జైలర్.
– కర్ణాటకలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ తమిళ ఓపెనర్
కర్ణాటకలో ఇప్పటివరకు విడుదలైన తమిళ సినిమాలలో, ఈ సినిమా మొదటిరోజు అత్యంత కలెక్షన్ సాధించిన తమిళ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
– కోలీవుడ్‌లో ఎర్లీ మార్నింగ్ షోల కేటగిరీ లేకుండా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ ఓపెనర్.
కోలీవుడ్ లో ఎర్లీ మార్నింగ్ షోస్ లేకుండా కూడా అత్యంత భారీ కలక్షన్స్ కలెక్ట్ చేసిన సినిమా గా నిలిచి చారిత్రాత్మక ఫీట్‌ను సాధించింది.
– AP, TS, KL, ROIలో 2023లో అతిపెద్ద తమిళ ఓపెనర్.
AP, TS, KL అంతటా 2023లో అతిపెద్ద తమిళ ఓపెనర్‌గా కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది.
– 2023లో ఓవర్సీస్‌లో అతిపెద్ద తమిళ ఓపెనర్
2023 సంవత్సరానికి ఓవర్సీస్ మార్కెట్లలో అతిపెద్ద తమిళ ఓపెనర్‌గా అపూర్వమైన ఫీట్‌ను సాధించింది ఈ చిత్రం.