Homeఎంటర్టైన్మెంట్ఆయనతో చాలా అన్యోన్యంగా ఉంటున్నా: ప్రియమణి

ఆయనతో చాలా అన్యోన్యంగా ఉంటున్నా: ప్రియమణి

మాజీ హీరోయిన్ ప్రియమణి భర్త ‘ముస్తాఫా రాజ్‌’కి గతంలోనే పెళ్లి అయిందని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదేంటి ప్రియమణి రెండో పెళ్లి వాడ్ని చేసుకుందా ? దేనికో ? అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ కామెంట్స్ పక్కన పెడితే.. ప్రియమణి భర్త ‘ముస్తాఫా రాజ్‌’ మొదటి భార్య టాపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ముస్తాఫా రాజ్‌ – ప్రియమణి వివాహం చెల్లదంటూ ముస్తాఫా రాజ్‌ మొదటి భార్య అయేషా కాస్త గట్టిగా […]

Priyamani Husbandమాజీ హీరోయిన్ ప్రియమణి భర్త ‘ముస్తాఫా రాజ్‌’కి గతంలోనే పెళ్లి అయిందని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదేంటి ప్రియమణి రెండో పెళ్లి వాడ్ని చేసుకుందా ? దేనికో ? అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ కామెంట్స్ పక్కన పెడితే.. ప్రియమణి భర్త ‘ముస్తాఫా రాజ్‌’ మొదటి భార్య టాపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.

ముస్తాఫా రాజ్‌ – ప్రియమణి వివాహం చెల్లదంటూ ముస్తాఫా రాజ్‌ మొదటి భార్య అయేషా కాస్త గట్టిగా వాదిస్తోంది. ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని ఇలా లాజిక్ లు తీస్తూ వివరణ ఇస్తోంది అయేషా. అయితే, తాజాగా అయేషా వాదన పై ప్రియమణి పరోక్షంగా అలాగే కాస్త తెలివిగా కూడా కామెంట్స్ చేసింది.

అవేంటో ప్రియమణి మాటల్లోనే ‘మనుషుల మధ్య కమ్యూనికేషన్‌ అనేది చాలా అవసరం. ఈ మధ్య ఎక్కువగా నాకు, ముస్తాఫాకు మధ్య ఉన్న రిలేషన్‌ పై చాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి నన్ను అడిగితే.. నేను – ముస్తాఫా చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉంటున్నాం. అలాగే ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది.

ప్రస్తుతం నా భర్త అమెరికాలో ఉన్నారు. అయినా ప్రతి రోజు మేము ఫోన్‌ లో మాట్లాడుకుంటూ అన్ని విషయాలను పంచుకుంటాం. కుదరకపోతే కనీసం హాయ్‌, బాయ్‌ అయినా చెప్పుకుని ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తాం. ఇలా ప్రతి రోజు మా మధ్య బంధం పెరుగుతూనే ఉంది. కొంతమంది మా బంధం పై వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజం కావు. అలాగే వారందరికి నేను చెప్పేది ఒక్కటే. మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం’ అంటూ ప్రియమణి తనదైన శైలిలో చెప్పుకొచ్చింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper