Bigg Boss 9 Telugu : ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ మొదటి నాలుగు వారాలు మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగింది. కామెడీ, ఎమోషన్స్, గొడవలు, టాస్కులు ఇలా ప్రతీ ఒక్కటి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉండేది. కానీ గత వారం నుండి షో బాగా డౌన్ అయ్యింది. అందుకే ఈ వారం నామినేషన్స్ ని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో చేయించారు. వారిలో మర్యాద మనీష్ కూడా ఒకరు. ఈయన హౌస్ లోకి వచ్చి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసి, ఆ తర్వాత ఇమ్మానుయేల్ కి తనూజ తో నామినేట్ చేయించే అవకాశం కల్పించాడు. ఎప్పటి నుండి తనూజ ని నామినేట్ చేయాలా, వద్దా అనే అయోమయ్యాం లో ఉన్న ఇమ్మానుయేల్, ఈరోజు ధైర్యం చేసి తనూజ ని నామినేట్ చేసాడు. ఆయన చెప్పిన పాయింట్స్ కూడా తనూజ ని ఇరుకున పెట్టెలాగానే ఉన్నాయి.
ముందుగా ఆయన చెప్పిన మొదటి పాయింట్ ఏమిటంటే, అయేషా తో అంత పెద్ద గొడవ అయ్యాక, మమ్మల్ని ఆమెకు ఉన్న పవర్ ని తీసెయ్యాలా వద్దా అని అడిగి, మా ముందు ఒక మాట చెప్పి, క్షణాల్లో మాట మార్చి ఆయేషా కి సపోర్ట్ చేయడం అసలు నచ్చలేదని అన్నాడు. దానికి తనూజ కౌంటర్ ఇస్తూ ‘అప్పుడు వారం మొత్తం సమయం తీసుకొని నిర్ణయించే సమయం నా దగ్గర లేదు. నేను మీరు స్నేహితులు కాబట్టి, కేవలం మీ అభిప్రాయం తీసుకున్నాను. ఇలా నామినేషన్స్ లోకి దాన్ని తీసుకొస్తారని నాకు తెలియదు. నేను మీతో చర్చించడమే చేసిన పెద్ద తప్పు. మీ అభిప్రాయం ఆరోజు చెప్పారు. నేను ఆలోచించుకొని నా నిర్ణయం నేను తీసుకున్నాను, అది కూడా తప్పేనా?’ అని అంటుంది తనూజ. ఇక ఇమ్మానుయేల్ వేసిన రెండవ పాయింట్ ఒక స్టాండ్ తీసుకుంటే దాని మీదనే నిలబడి ఉండు అని అనడం.
అందుకు ఉదాహరణ చెప్తూ, బొమ్మల టాస్క్ లో నా కోసం పోరాడిన తనూజ, అకస్మాత్తుగా రాము కి సపోర్ట్ చేయడం నన్ను షాక్ కి గురి చేసింది అని అంటాడు. అప్పుడు తనూజ ‘నేను నిన్న అడిగాను. నువ్వు ఓకే అంటేనే నేను రాము కి సపోర్ట్ చేసాను. అప్పుడొక మాట ఇప్పుడొక మాట. రెండు నాలుకల మనిషివి నువ్వు’ అని అంటుంది. అలా వీళ్లిద్దరి మధ్య మాట మాట బాగా పెరుగుతుంది. తనూజ కాస్త నోరు జారుతూ ‘నీ గేమ్ కోసం మనుషులను వాడుకుంటావ్’ అని అంటుంది. ఇక్కడ ఇమ్మానుయేల్ బాగా హర్ట్ అవుతాడు. అవును నేను అలా వాడుకునే వాడినే, కాబట్టి ఇక నా దగ్గరకు రాకండి అని అంటాడు. ఇది లైవ్ లో జరిగిన నామినేషన్. ఈరోజు ఎపిసోడ్ లో దీన్ని చూపిస్తారో లేదో చూడాలి. ఇద్దరి స్నేహితుల మధ్య గొడవలు చాలా గట్టిగానే జరిగింది. చూడాలి మరి ఈ గొడవలను ఇలాగే కొనసాగిస్తారా?,లేదంటే మళ్లీ స్నేహితులు అయిపోతారా అనేది.