Sardar 2 Movie: తమిళ హీరో కార్తీ కెరీర్ ది బెస్ట్ చిత్రాల్లో ఒకటి ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా 2022 వ సంవత్సరం లో దీపావళి కానుకగా విడుదలై కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈమధ్య కాలం విడుదలైన స్పై జానర్ సినిమాల్లో సౌత్ లోనే ది బెస్ట్ గా నిల్చింది ఈ చిత్రం. అలాంటి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ‘సర్దార్ 2’ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా కార్తీ , ఎస్ జే సూర్య ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా వీళ్లిద్దరు కలిసి ఎస్ జె సూర్య తో చేసిన ఇంటర్వ్యూ బాగా హైలైట్ అయ్యింది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా , ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూ లో చూద్దాం.
కథ:
ఇక కథ విషయానికి వస్తే మొదటి భాగం లో ప్లాస్టిక్ బాటిల్ ద్వారా మంచి నీళ్లు తాగడం వల్ల , ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది వివరంగా చూపించారు. ప్లాస్టిక్ బాటిల్స్ ఎలా తయారు చేస్తారో కూడా వివరించారు. అవి చూసినప్పుడు ప్రేక్షకులకు మనం రోజు ఇలాంటి నీళ్లు తాగుతున్నామా?, ఇక నుండి ప్లాస్టిక్ బాటిల్స్ లో మంచి నీళ్లు తాగడం తగ్గించాలి అనేది తెలుసుకున్నారు. అంతే కాకుండా మన దేశం లో మంచి నీళ్లను కమర్షియల్ గా ఎలా ఉపయోగించుకుంటున్నారు?, దాని వల్ల నీతి కొరత వచ్చి ఎంత మంది దాహార్తితో చనిపోతున్నారు అనేది చూపించారు. ఇక ‘సర్దార్ 2’ లో అయితే ఆరోగ్యం, శుభ్రత చుట్టూ స్టోరీ తిరుగుతుంది. శుభ్రత లేకపోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, కార్పొరేట్ కంపెనీల కారణంగా , జనాల ఆరోగ్యం ఎలా క్షీణించబోతుంది? వంటివి సామజిక అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ క్రమం లో హీరో కి ఎదురయ్యే సమస్యలు ఏంటి? అనేది స్టోరీ.
విశ్లేషణ :
ఈ కథ కి చాలా మంచి పొటెన్షియల్ ఉంది. కానీ స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. సినిమా ఆరంభం చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. డైరెక్టర్ మిత్రన్ ప్రేక్షకులను నేరుగా కథలోకి తీసుకెళ్తాడు. కానీ అవసరానికి మించి ఓవర్ ది టాప్ ఎగ్జిక్యూషన్ వల్ల , ఆడియన్స్ కి స్క్రీన్ ప్లే కి ఎంగేజ్ అవ్వలేకపోయారు. అంతే కాకుండా సినిమా రన్ టైం కూడా చాలా పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. రన్ టైం ఎక్కువ ఉన్నప్పటికీ ఆడియన్స్ ఎంజాయ్ చేసిన సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. కానీ ఇలాంటి రన్ టైం ఆధారిత సినిమాలకు స్క్రీన్ ప్లే ఎంటర్టైన్ గా ఉండడం అత్యంత అవసరం. ఇక్కడ అదే మిస్ అయ్యింది.
మరో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే శ్యామ్ CS మ్యూజిక్. ఎంత మంచి సన్నివేశం అయినా వెండితెర పై ఎలివేట్ అవ్వాలంటే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుండడం తప్పనిసరి. కానీ ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ సరిగా లేదు. సినిమా బాగున్న సన్నివేశాలను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. కానీ ఈ సినిమాకు ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే, ప్రొడక్షన్ వాల్యూస్. చాలా టాప్ లెవెల్ లో ఉన్నాయి. అదే విధంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు థియేటర్స్ లో ఆడియన్స్ కి మంచి థియేట్రికల్ అనుభూతిని ఇచ్చాయి. ఫస్ట్ హాఫ్ కాస్త ఇంటెన్స్ డ్రామా గానే ఉంటుంది. ఎక్కడా డీవియేషన్స్ ఉండవు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వెళ్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్కడ నుండి మొదలై , ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ అర్థం అవ్వదు. ఓవరాల్ గా మంచి పొటెన్షియన్ ఉన్న సబ్జెక్టు ని పూర్ టేకింగ్ తో బిలో యావరేజ్ ప్రోడక్ట్ గా మలిచారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే కార్తీ ఎప్పటి లాగానే తన సహజమైన నటన తో అల్లాడించాడు. డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడు. కానీ ఎస్ జె సూర్య నటన మాత్రం గత సినిమాల మాదిరిగానే ఉంది. ఆయన యాక్టింగ్ మార్చకపోతే , ఇకపై ఆయన సినిమాలకు పెద్ద మైనస్ పాయింట్ లాగా మారే అవకాశాలు ఉన్నాయి. నటన లో ఎలాంటి వేరియేషన్ కనిపించడం లేదు. అన్నిట్లో ఒకే తరహా నటననే ఉంటుంది. ఇక మాళవిక మోహనన్ కి పర్వాలేదు అనిపించే రోల్ దక్కింది. ఆమె పాత్రకు న్యాయం చేసింది. కానీ ఆషికా రంగనాథ్ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. మంచి పొటెన్షియల్ ఉన్న నటిని సరిగా ఉపయోగించుకోలేదు డైరెక్టర్.
ఓవరాల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, బిలో యావరేజ్ థ్రిల్లర్. ఈ చిత్రానికి మేము ఇస్తున్న రేటింగ్ 2.25 మాత్రమే. సినిమా రన్ టైం తగ్గిస్తే, ఒకసారి చూడాలని అనుకునే ఆడియన్స్ కి ఈ చిత్రం పర్వాలేదు అనిపించొచ్చు. ఒకవేళ రన్ టైం తగ్గించుకుంటే, కార్తీ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాని మీరు కూడా చూశారా ?, చూస్తే ఈ సినిమా పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.