Hero Arjun: సౌత్ ఇండియా లో దశాబ్దాల నుండి సినిమాలు చేస్తూ, అన్ని భాషల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకడు అర్జున్ సర్జా(Arjun Sarja). అభిమానులు ఈయన్ని ప్రేమతో యాక్షన్ కింగ్ అని పిలుచుకుంటూ ఉంటారు. ‘మా పల్లెలో గోపాలుడు’ అనే సినిమా ద్వారా హీరో గా వెండితెర అరంగేట్రం చేసిన అర్జున్, అన్ని భాషలకు కలిపి తన కెరీర్ లో దాదాపుగా 180 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇప్పుడు హీరో గా ఆయన మార్కెట్ ని కోల్పోయినప్పటికీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి తెలుగు , తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు అర్జున్. అయితే ఆయన దర్శకుడిగా మారి తన కూతురు ఐశ్వర్య ని హీరోయిన్ గా పెట్టి ‘సీత పయనం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా అర్జున్ ప్రొమోషన్స్ లో చాలా యాక్టీవ్ గా పాల్గొంటున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గానే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితం లో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ డబ్బు సంపాదన పై, ఆస్తులు సమకూర్చడం పై నేను ఎప్పుడూ కూడా ఫోకస్ పెట్టలేదు. నా 46 ఏళ్ళ సుదీర్ఘ సినీ కెరీర్ లో ఎంతో మంది నన్ను దారుణంగా మోసం చేశారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పదల్చుకోలేదు. నాతో ఉంటూ, నాకు ఏమి తెలియని వయస్సులో నన్ను దెబ్బతీశారు. చిన్న వయసులోనే డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాను. కానీ ఆ డబ్బులు ఎక్కడ పెట్టుబడులుగా పెట్టాలో అర్థం కాలేదు. నా వాళ్ళే నాకు వెన్నుపోతూ పొడిచారు. ఆరోజుల్లో నేను సరైన వాటిల్లో పెట్టుబడులు పెట్టుంటే, ఈరోజు నాకు బోలెడంత ఆస్తులు ఉండేవి’.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆరోజుల్లో నాకు శోభన్ బాబు గారు పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో చెప్పేవారు. డబ్బులు ఎక్కడ వృధా అవుతున్నాయో చూసుకోమని కూడా చాలా సార్లు హెచ్చరించేవారు. ఆయన నాతో చాలా క్లోజ్ గా ఉండేవారు. అప్పట్లో మేమిద్దరం కలిసి ఒక సినిమాలో పని చేసాము. కేవలం ఒక్క సినిమాతోనే మా ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. మా మధ్య ఉన్న అనుభందం చూసి అందరూ కుళ్ళుకునే వారు. అయితే అప్పట్లో శోభన్ బాబు చెప్పిన జాగ్రత్తలు, సూచనలు నా బుర్రకు ఎక్కలేదు. ఆయన మాటలు వినకే ఇలా ఆస్తులు ఏర్పాటు చేసుకోలేకపోయాను. లేదంటే ఈరోజు నా పరిస్థితి వేరేలా ఉండేది’ అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు.
