Vijay Trisha : గత కొంత కాలం గా మీడియా లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విడాకుల వ్యవహారం పై ఏ రేంజ్ లో చర్చలు నడుస్తున్నాయి మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. విజయ్ 2022 నుండి త్రిష తో డేటింగ్ చేస్తున్నాడని , అప్పటి నుండి భార్య సంగీత దూరమైంది అని, చివరికి ఆమె తట్టుకోలేక కోర్టు విడాకులు కోరుతూ పిటీషన్ వేసిందని, ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. సంగీత విడాకుల పిటీషన్ వేసిన తర్వాత విజయ్ త్రిష తో తనకు ఉన్న రిలేషన్ ని బహిర్గతం చేసాడు. డైరెక్ట్ గా ఆమెతో డేటింగ్ చేస్తున్న విషయం చెప్పలేదు కానీ , పరోక్షంగా మేమిద్దరం కలిసే ఉన్నాం అనే హింట్ జనాలకు ఇచ్చేసాడు. ఇక సంగీత ఎలాగో విడాకుల పిటీషన్ వేసింది , కోర్టు విడాకులు మంజూరు చేసిన తర్వాత విజయ్ – త్రిష లు బహిరంగంగా పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు.
కానీ కట్ చేస్తే నిన్న సంగీత విడాకుల పిటీషన్ ని వెనక్కి తీసుకుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇలా ఆమె విడాకుల పిటీషన్ ని వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటి? , విజయ్ తో కలిసి ఉండాలని శాంతి ఒప్పందం చేసుకుందా?, దీని వెనుక ఉన్న మర్మం ఏంటి?, విజయ్ – త్రిష ల బంధాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకున్నానని ఫీల్ అయ్యిందా?, వాళ్ళ మధ్య స్నేహం తప్ప ఇంకేమి లేదని అర్థం చేసుకుందా?, ఇలా ఎన్నో రకాల ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. అయితే విశ్లేషకులు మరో కోణం లో కూడా ఈ అంశాన్ని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు సంగీత విడాకులు ఇస్తే, విజయ్ – త్రిష లు అధికారికంగా పెళ్లి చేసుకొని శాశ్వత వైవాహిక జీవితం లోకి అడుగుపెడతారు , అలా జరగకూడదు అనే సంగీత ఇలా చేసిందా ? అని అంటున్నారు.
ఒకవేళ విజయ్, త్రిష పెళ్లి చేసుకుంటే , విజయ్ ఆస్తులు మొత్తం త్రిష కి చెందుతుంది , అంతే కాకుండా , రాజకీయ పరంగా కూడా త్రిష మరో లెవెల్ కి వెళ్తుంది. అది సంగీత కి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే ఇలా చేసి ఉంటుందని అంటున్నారు. అంతే కాదు , విజయ్ – త్రిష పెళ్లి చేసుకుంటే , సోషల్ మీడియా లో పొలిటికల్ నెట్వర్క్ లో వీళ్ళ బంధం గురించి వస్తున్నా విమర్శలకు కూడా చెక్ పడుతుంది. అలా జరగకూడదు అనే ఉద్దేశ్యంతోనే ఆమె తెలివిగా విడాకుల పిటీషన్ ని వెనక్కి తీసుకొని ఉండొచ్చని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.