Homeఎంటర్టైన్మెంట్Pradeep Rawat : చనిపోయే ముందు మా నాన్న నరకం అనుభవించాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న...

Pradeep Rawat : చనిపోయే ముందు మా నాన్న నరకం అనుభవించాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రదీప్ రావత్ కుమారుడు..

Pradeep Rawat : పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ, ప్రేక్షకులను అలరించిన ప్రదీప్ రావత్ , రీసెంట్ గానే తన నివాసం లో గుండెపోటు తో మరణించిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ‘సై’ చిత్రం లోని భిక్షు యాదవ్ పాత్రతో ప్రదీప్ రావత్ తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన […]

Pradeep Rawat : పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ, ప్రేక్షకులను అలరించిన ప్రదీప్ రావత్ , రీసెంట్ గానే తన నివాసం లో గుండెపోటు తో మరణించిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ‘సై’ చిత్రం లోని భిక్షు యాదవ్ పాత్రతో ప్రదీప్ రావత్ తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన ఛత్రపతి, భద్ర, అందరివాడు , ఛత్రపతి , లక్ష్మి , స్టాలిన్, దేశముదురు , యోగి, జగడం, నగరం , మస్కా, నాయక్, రగడ, నేను శైలజ, వాల్తేరు వీరయ్య , ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఈ ఏడాది కూడా ఆయన కీలక పాత్ర పోషించిన ‘గాయపడ్డ సింహం’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అలా యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చే ప్రదీప్ రావత్ ఇలా హట్టాతుగా చనిపోవడం ఇండస్ట్రీ కి తీరని లోటు అనే చెప్పాలి. ఇకపోతే ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోల్లో ప్రదీప్ రావత్ కుటుంబం పడే బాధని చూసిన నెటిజెన్స్ కంటతడి పెట్టుకుంటున్నారు. రీసెంట్ గా ఆయన తనయుడు విక్రమాదిత్య మీడియా తో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నాడు. చివరి రోజుల్లో తన తండ్రి పడిన బాధలను వివరిస్తూ చలించిపోయాడు విక్రమాదిత్య. ఆయన మాట్లాడుతూ ‘నాన్నకు మొదట కడుపులో సాధారమైన ఇన్ఫెక్షన్ వచ్చిందని మేమంతా అనుకున్నాము. అయినప్పటికీ మేము నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాము. డాక్టర్లు చాలా మందులు ఇచ్చారు. అవి ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపర్చలేకపోయాయి. నాన్న ఆరోగ్యం బాగా క్షీణించిందని అమ్మ ఒక రోజు నాకు ఫోన్ చేసి చెప్పింది’.

‘అయితే నాన్నకు వైద్యులు వివిధ టెస్టులు చేయగా, ఆయన శరీరం లో తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉందని తేలింది. దీంతో వెంటనే ఆయన్ని కోకిలాబెన్ హాస్పిటల్ కి తరలించాం. అక్కడి డాక్టర్లు నాన్నకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు చెప్పారు. ఆ మాట వినగానే మేమంతా కుప్పకూలిపోయాము. ఇదొక అరుదైన క్యాన్సార్ అట. చాలా వేగంగా శరీరం మొత్తం విస్తరిస్తుంది అట. అయితే రెండు నెలల క్రితమే నాన్నకు మరోసారి అన్ని రకాల టెస్టులు చేయించాము. రిపోర్ట్స్ సాధారణంగానే ఉన్నాయి. కానీ నెలన్నర వ్యవధిలో అంతా మారిపోయింది. ఆయనని ICU లో చేర్చినప్పుడు , డాక్టర్లు CPR చేయడం మా కళ్ళతో చూశాము. అది చూసినప్పుడు పరిస్థితి ఎంత తీవ్ర రూపం దాల్చిందో అర్థమైంది. అవే మా నాన్నకు చివరి క్షణాలు అనేది మాకు తెలిసిపోయింది. ఆ క్షణం మా అమ్మ గుండెలు పగిలేలా ఏడ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper