Homeఎంటర్టైన్మెంట్DC Movie Collections: సైలెంట్ గా వచ్చి సునామీ సృష్టించిన లోకేష్ కనకరాజ్ 'DC'..ఇదేమి గ్రాస్...

DC Movie Collections: సైలెంట్ గా వచ్చి సునామీ సృష్టించిన లోకేష్ కనకరాజ్ ‘DC’..ఇదేమి గ్రాస్ వసూళ్లు సామీ!

DC Movie Collections: డైరెక్టర్ గా లోకేష్ కనకరాజ్ కి నేటి తరం జెన్ జీ ఆడియన్స్ లో ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియా వైడ్ గా టాప్ 3 డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే , కచ్చితంగా లోకేష్ కనకరాజ్ పేరు కూడా ఉంటుంది. ఆయనతో సినిమాలు చేయడం కోసం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతీ స్టార్ హీరో క్యూలు కడుతుంటారు. నిర్మాతలు వందల కోట్ల అడ్వాన్స్ లు కూడా […]

DC Movie Collections: డైరెక్టర్ గా లోకేష్ కనకరాజ్ కి నేటి తరం జెన్ జీ ఆడియన్స్ లో ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియా వైడ్ గా టాప్ 3 డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే , కచ్చితంగా లోకేష్ కనకరాజ్ పేరు కూడా ఉంటుంది. ఆయనతో సినిమాలు చేయడం కోసం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతీ స్టార్ హీరో క్యూలు కడుతుంటారు. నిర్మాతలు వందల కోట్ల అడ్వాన్స్ లు కూడా ఇస్తుంటారు. అలాంటి డైరెక్టర్ హీరో గా ‘DC ‘ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. టీజర్ , ట్రైలర్ విడుదలకు ముందు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ , అనిరుద్ అందించిన మ్యూజిక్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గానే జరిగాయి. కానీ ఆడియన్స్ నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా చాలా డీసెంట్ గా వచ్చాయి.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 52 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. నైజాం ప్రాంతం నుండి 94 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 58 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు రెండు రాష్ట్రాలకు కలిపి 75 లక్షల రూపాయిలు వచ్చాయట. విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు 4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. పాజిటివ్ టాక్ బాగా ఉండడం తో , ఈ వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , తమిళనాడు రాష్ట్రం నుండి 2 కోట్ల 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.

అదే విధంగా కర్ణాటక రాష్ట్రము నుండి 75 లక్షలు , కేరళ నుండి 45 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 40 లక్షలు , ఓవర్సీస్ నుండి 1 కోటి 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 6 కోట్ల 32 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 2 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. విడుదలకు ముందు 18 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. క్లీన్ హిట్ స్టేటస్ ని అందుకోవాలంటే మరో 15 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. రెండవ రోజు వసూళ్లు మొదటి రోజు కంటే రెండింతలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయట. వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper