Vishwanath and Sons: సూపర్ స్టార్ స్టేటస్ లో ఉన్న ఒక హీరో కి , పదేళ్ల నుండి వరుస ఫ్లాప్స్ వచ్చినా పర్వాలేదు , కేవలం ఒక్క సరైన హిట్ పడితే చాలు , ఆ హీరో మార్కెట్ మొత్తం తిరిగి వచ్చేస్తుంది అని చెప్పడానికి రీసెంట్ బెస్ట్ ఉదాహరణ సూర్య. తెలుగు , తమిళం , మలయాళం భాషల్లో ఈయనకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఒకానొక దశలో రజినీకాంత్ ని మించిన మార్కెట్ సొంతమైంది. కానీ కొన్ని ప్రయోగాత్మక చిత్రాల కారణంగా సూర్య వరుసగా 12 ఏళ్ళు ఫ్లాప్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. అలాంటి సమయం లో ఈ ఏడాది మే నెలలో విడుదలైన ‘కరుప్పు’ చిత్రం సూర్య కెరీర్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. చాలా సాధారణమైన అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం , ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 340 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఈ చిత్రం తర్వాత ఆయన నుండి విడుదల కాబోతున్న చిత్రం ‘విశ్వనాధ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం లో నాగవంశీ నిర్మాణం లో తెరకెక్కిన ఈ సినిమా , ఈ నెల 14 వ తేదీన అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ప్రమోషనల్ కంటెంట్ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ పైన కూడా పడింది. నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన తమిళ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు మేకర్స్. బుకింగ్స్ ని ప్రారంభించిన 16 నిమిషాల్లోనే ఈ చిత్రానికి 10 వేలకు పైగా టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు ఏ తమిళ్ సినిమాకు కూడా ఇంత తక్కువ సమయం లో ఆ స్థాయిలో టికెట్స్ అమ్మకం జరగలేదు అంటూ విశ్లేషకులు అంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ కి 17 నిమిషాల 45 సెకండ్స్ లో 10 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఆ రికార్డు ని సూర్య అవలీల గా బ్రేక్ చేయడం ఇప్పుడు తమిళ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రస్తుతానికి అయితే బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 5 నుండి 10 వేల మధ్యలో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. సినిమా విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది , అయినప్పటికీ కూడా ఈ రేంజ్ ట్రెండ్ చూపిస్తుందంటే , కచ్చితంగా ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ గ్యారంటీ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.