Suriya: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హీరో సూర్య తో పాటు , మూవీ టీం కి సంబంధించిన వాళ్లంతా హాజరయ్యారు. మంగళవారం అయినప్పటికీ కూడా అభిమానులు భారీ రేంజ్ లో ఈవెంట్ కి విచ్చేశారు. సూర్య పేరు వినపడినప్పుడల్లా ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ ఈవెంట్ లో ముఖ్యంగా సూర్య మాట్లాడిన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. తనని ప్రేమిస్తున్న తెలుగు ఆడియన్స్ గురించి ఆయన మాట్లాడిన విధానం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేము. అంత అద్భుతంగా మాట్లాడాడు హీరో సూర్య. ఇదే వేదిక పై ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా చోటు చేసుకుంది.
సూర్య వెంకీ అట్లూరి గురించి మాట్లాడుతున్నప్పుడు, వెంకీ అట్లూరి సూర్య దృష్టిని మరలించి , ఆయన కాళ్లకు దండం పెడుతాడు. అప్పుడు సూర్య ఆశ్చర్యానికి గురై ‘హేయ్ ‘ అని అరుస్తాడు. ఈ మూమెంట్ చూసేందుకు చాలా ముచ్చటగా అనిపించింది. వీళ్లిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ఈ ఒక్క క్యూట్ సంఘటన తో బయటపడింది. వెంకీ అట్లూరి గురించి సూర్య మాట్లాడుతూ ‘నేను వెంకీ తో సినిమా ఇప్పుడు చేసానని చెప్పడం లేదు కానీ , ఆయన లాగా ఈ సినిమా కథకు న్యాయం చేసే డైరెక్టర్ మరొకరు ఉంటాడని అనుకోను. తన వైపు నుండి 200 శాతం ఎఫోర్ట్స్ పెడుతూ చాలా నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అతన్ని ఒక డైరెక్టర్ గా కంటే , నేను రచయితా గా ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టు లో మూడు అద్భుతమైన ఫిమేల్ క్యారెక్టర్స్ రాయడం చాలా కష్టమైన విషయం’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అతనితో కలిసి షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రతీ సన్నివేశం , ప్రతీ డైలాగ్ చాలా ఫ్రెష్ గా అనిపించేవి. ఒక చిన్న పిల్లవాడి లో ఉన్న ఎనర్జీ , ఉత్సాహం అతనిలో ఉంది. ఇప్పటి వరకు లక్కీ భాస్కర్ తర్వాత అతని సినిమాలు చూశాక , నాకు కూడా అతనితో కలిసి ఒక సినిమా చెయ్యాలని అనిపించింది. నాగవంశీ ఇతన్ని నా దగ్గరకు అద్భుతమైన కథతో తీసుకొచ్చినందుకు దానువాదాలు. ముందుగా ఒక బయోపిక్ చేద్దామని అనుకున్నాము. కానీ చివరికి ఇది చేశాము’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్య. ఇక వెంకీ అట్లూరి సూర్య కాళ్ళు పట్టుకున్న క్యూట్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Beautiful moment yesterday at #VishwanathAndSons Pre release event.
Director #VenkyAtluri and Hero @Suriya_offl bonding ❤️ pic.twitter.com/GBehcYxEuy
— H A N U (@HanuNews) August 12, 2026