Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కి కోర్టులు , కేసులు కొత్తేమి కాదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన కేసుల్లో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సల్మాన్ ఖాన్ , ఆయన చెల్లి అల్వీరా ఖాన్ లకు చండీగఢ్ కోర్టు రీసెంట్ గానే నోటీసులు జారీ చేసింది. గత కొన్నేళ్ల నుండి వీళ్ళు నిర్వహిస్తున్న ‘బీయింగ్ హ్యూమన్’ అనే స్వచ్చంధ సంస్థ జ్యువెలరీ ఫ్రాంచైజ్ కి సంబంధించి 2 కోట్లకు పైగా మోసం జరిగిందన్న ఫిర్యాదు పై కోర్టు ఈ నోటీసులను అందించింది. చండీగఢ్ కి చెందిన అరుణ్ గుప్తా ఈ ఫిర్యాదు దాఖలు చేసాడు. 2018 వ సంవత్సరం లో ‘బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ’ ఫ్రాంచైజ్ స్టోర్ ని ప్రారంభించేందుకు తాము సుమారుగా 2 నుండి 3 కోట్ల రూపాయిల పెట్టుబడి పెట్టినట్టు ఆ ఫిర్యాదు లో పేర్కొన్నారు.
అయితే షో రోమ్ ప్రారంభోత్సవానికి సల్మాన్ ఖాన్ స్వయంగా వస్తారని , బ్రాండ్ ప్రొమోషన్స్ తో పాటు క్రమం తప్పకుండా ప్రొడక్ట్స్ స్టాక్ పంపుతామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారట. అయితే ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటి వరకు ఎలాంటి స్టాక్ పంపలేదని , ప్రొమోషన్స్ గురించి అసలు పట్టించుకోవడం లేదని, కనీసం ఇచ్చిన డబ్బులకు రెస్పాన్స్ కూడా సరిగా ఇవ్వడం లేదని అరుణ్ గుప్తా తన ఆవేదన మొత్తాన్ని ఫిర్యాదు లో పెట్టాడు. దీనిపై రీసెంట్ గానే విచారణ చేపట్టిన చండీఘడ్ మేజిస్ట్రేట్ కోర్టు, సల్మాన్ ఖాన్, ఆయన చెల్లెలు అల్వీరా ఖాన్ లకు కౌంటర్ పిటీషన్ దాఖలు చెయ్యాలని కోర్టు నోటీసులు పంపింది. అయితే వారి నుండి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇలా రెస్పాన్స్ ఇవ్వకుండా ఉంటే కోర్టు న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందా ?, అరెస్ట్ చేస్తారా ? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే , రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్ లో నెంబర్ 1 హీరో గా కొనసాగుతూ , తిరుగులేని బాక్స్ ఆఫీస్ డామినేషన్ చూపిస్తూ వచ్చిన సల్మాన్ ఖాన్ , కరోనా లాక్ డౌన్ తర్వాత వరుస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఆయన చిత్రం ‘సికిందర్’ భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ గా నిల్చింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అపూర్వ లఖియా దర్శకత్వం లో ‘మాతృ భూమి’, అదే విధంగా మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం లో మరో మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల పైనే అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. పైగా వరుస డిజాస్టర్ రావడంతో సల్మాన్ ఖాన్ తన రెమ్యూనరేషన్ కూడా సగానికి తగ్గించుకున్నట్టు టాక్.