Homeఎంటర్టైన్మెంట్Ramayana Trailer Review: 'రామాయణం' ట్రైలర్ రివ్యూ: అన్ని బాగున్నాయి...కానీ అదొక్కటే మైనస్ అయిందిగా...

Ramayana Trailer Review: ‘రామాయణం’ ట్రైలర్ రివ్యూ: అన్ని బాగున్నాయి…కానీ అదొక్కటే మైనస్ అయిందిగా…

Ramayana Trailer Review: నితిష్ తివారి దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ రాముడిగా,సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడి గా తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణం’…ఈ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంతో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని గత కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ భారీ విమర్శలను ఎదుర్కొంది. దాంతో ట్రైలర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసిన దర్శకుడు దానిని అద్భుతంగా తీర్చిదిద్దడనే చెప్పాలి. ఇంతకుముందు […]

Ramayana Trailer Review: నితిష్ తివారి దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ రాముడిగా,సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడి గా తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణం’…ఈ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంతో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని గత కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ భారీ విమర్శలను ఎదుర్కొంది. దాంతో ట్రైలర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసిన దర్శకుడు దానిని అద్భుతంగా తీర్చిదిద్దడనే చెప్పాలి. ఇంతకుముందు రామాయణం కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని వచ్చిన సినిమాల కంటే కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో ప్రజెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రావణాసురుడి పాత్రను చాలా స్ట్రాంగ్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అతడు ఎలా లంక నగరానికి రాజయ్యాడు, ఎన్ని రాజ్యాలను తన ఆధీనంలో పెట్టుకున్నాడు. తనకు ఎదురొచ్చిన వారిని ఏం చేస్తాడనే ఒక క్యూరియాసిటిని రేకెత్తిస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. రావణాసురుడు ఎదిగిన తీరును కూడా మనకు ఈ సినిమాలో పెర్ఫెక్ట్ గా చూపించబోతున్నారు. అలాగే రాముడు యుద్ధవిద్యలు నేర్చుకోవడం సీతను కలుసుకునే సన్నివేశాలు సైతం గూస్ బంప్స్ ఎపిసోడ్స్ గా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది. సీతారాముల వివాహం ఎలా జరిగింది. వాళ్లు వనవాసానికి వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులను సైతం చాలా కండ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటి పార్ట్ సీత ను రావణుడు ఎత్తుకెళ్లే వరకు ఉంటుంది. రెండు పార్ట్ లో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు కలిసి తీసుకురావడానికి ఎలాంటి ప్లాన్స్ వేశారు అనేది చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ ట్రైలర్లో విజువల్స్ అయితే టాప్ నాచ్ లో ఉన్నాయి. ప్రతి షాప్ లో గ్రాండియర్ ని చూపించారు. ముఖ్యంగా రామాయణానికి ఇలాంటి హై వోల్టేజ్ సీన్స్ కావాలో ఇందులో వాటిని ఇందులో పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు.

మొత్తానికైతే రావణాసురుడిగా యశ్ బాగా సెట్ అయ్యాడు. రాముడిగా రణ్బీర్ కపూర్ సైతం తన మార్క్ ను చూపించినట్టుగా తెలుస్తుంది. ఇక సాయి పల్లవి సీతగా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందనేది ట్రైయర్ చూస్తేనే అర్థమవుతుంది. సూర్పనక్క గా రకుల్ ప్రీతి సింగ్ సైతం తన పాత్రకి న్యాయం చేసినట్టుగా కనిపిస్తుంది. అంత బాగానే ఉంది కానీ హనుమంతుని పాత్రను మాత్రం ట్రైలర్ లో రివిల్ చేయలేదు.

ఆయన సెకండ్ పార్ట్ లో వస్తాడు. కాబట్టి అతన్ని ఫస్ట్ ట్రైలర్ లో రివిల్ చేయనట్టుగా సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి… నిజానికి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి హనుమంతుడు కనిపించలేదనే ఒక అసంతృప్తి లో ఉన్నారు. అదొక్కటే ఈ ట్రైలర్ లో మైనస్ గా అనిపిస్తుంది.

ఎందుకంటే హనుమంతుడికి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆయన్ని కూడా ట్రైలర్ లో చూపిస్తే గూస్ బంప్స్ వచ్చుండేవి…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని వేల కోట్ల కలెక్షన్స్ ను రాబడుతుంది. ప్రేక్షకులను ఎంతవరకు ఎంటర్ టైన్ చేయగలుగుతుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper