Palla Burusu Movie : గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ యాస మీద ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. భారీ సక్సెస్ లను సాధిస్తున్నాయి. ముఖ్యంగా ‘బలగం’ సినిమాతో తెలంగాణ మాండలికానికి యావత్ ప్రేక్షకలోకం మంత్ర ముగ్ధులైపోయారు. స్టార్ హీరోల సినిమాలకు సైతం తెలంగాణ యాసను యాడ్ చేస్తున్నారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ యాస ఎంత పాపులారిటిని సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ‘పళ్ల బురుసు’ అనే సినిమాలో సైతం మరోసారి తెలంగాణ యాస తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ని అన్నపూర్ణ స్టూడియోస్ మీద అక్కినేని నాగార్జున నిర్మిస్తుండటం విశేషం…ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని గత కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు… పళ్ల బురుసు కోసం తండ్రి కొడుకుల మధ్య జరిగే వార్ గా ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. తండ్రి గా సుధాకర్ రెడ్డి, కొడుకుగా మురళీధర్ గౌడ్ నటించడం విశేషం…
వీళ్లిద్దరూ కూడా ‘బలగం’ సినిమాలో నటించి గొప్ప పాపులారిటిని సంపాదించుకున్న వారే కావడం వల్ల ఈ సినిమాకి వాళ్ళు చాలా వరకు ప్లస్ అవుతారు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
ఒకే ఊరిలో ఒకే ఇంట్లో ఉండే తండ్రి కొడుకుల మధ్య జరిగే వార్ కి కొన్ని సరదా సన్నివేశాలను కలిపి చూపించబోతున్నారు. తెలంగాణ నేపథ్యంలో ఒక చిన్న పాయింట్ ను కథగా మార్చి ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఈ కాన్సెప్ట్ ను తీర్చిదిద్దారు. అలాగే ప్రేక్షకుల్లో అంతర్లీనంగా ఉన్న ఒక ఎమోషన్ ని పట్టుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.
దర్శకుడు చాలా బాగా ఆలోచించి దానికి తెలంగాణ మాండలికాన్ని ఆడ్ చేసి ప్రస్తుతం ఉన్న ప్రేక్షకుల అటెన్షన్ ను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి తండ్రి కొడుకులు మధ్య జరుగుతున్న వార్ కి కారణం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు అన్ని సద్దుమణుగుతాయా? వాళ్ళిద్దరు ఈ సినిమాలో కలిసిపోతారా ఫైనల్ గా వాళ్లు ఏం చెప్పబోతున్నారు అనేది తెలియాలంటే మాత్రం ఆగస్టు 14వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…