Homeఎంటర్టైన్మెంట్Kajal Aggarwal: నా కొడుక్కి రావణాసురుడు అంటే ఇష్టం అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal: నా కొడుక్కి రావణాసురుడు అంటే ఇష్టం అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal: మన టాలీవుడ్ లో యూత్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ప్రతీ ఒక్కరు ఇష్టపడే హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి , సౌత్ ఇండియా లో దాదాపుగా అందరి సూపర్ స్టార్స్ తో కలిసి సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. నేటి తరం సూపర్ స్టార్స్ తో కలిసి పని చేయడమే కాకుండా, నిన్నటి తరం స్టార్ హీరోలతో కూడా పనిచేసిన ఘనత కాజల్ అగర్వాల్ సొంతం. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే గౌతమ్ కిచులు ని పెళ్ళాడి సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన కాజల్, ఆ తర్వాత కొడుక్కి జన్మనిచ్చాక మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే రీ ఎంట్రీ తర్వాత కాజల్ అగర్వాల్ కి చెప్పుకోదగ్గ రోల్స్ దొరకడం లేదు.

అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది కానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. మెల్లిగా హీరోయిన్ రోల్స్ నుండి క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఇకపోతే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె నితీష్ తివారీ బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న రామాయణం లో రావణాసురిడి భార్య మండోదరి క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ‘మా అబ్బాయికి రామాయణం అంటే చాలా ఇష్టం . నేను హిందీ రామాయణం లో నటిస్తున్నాను అనే విషయం వాడికి తెలిసినప్పుడు చాలా సొంతోషించాడు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా, రావణుడి పాత్రలో యాష్ నాయిస్తున్నారు. నేను రావణుడి భార్య మండోదరి క్యారెక్టర్ చేస్తున్నాను. మా అబ్బాయికి రావణుడి పాత్ర అంటే చాలా ఇష్టం. ఈ సినిమా రెండవ భాగం విడుదల అయ్యేసరికి వాడికి ఐదేళ్లు నిండుతాయి. థియేటర్ లో వాడు చూసే మొట్టమొదటి సినిమా ఇదే అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.

ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రామాయణం చూసి రాముడికి సీతకు , హనుమంతుడికి ఫ్యాన్ అవ్వాలి కానీ , రావణాసురుడికి ఫ్యాన్ ఏంటి?, అలాంటి రాక్షసుడు చిన్న పిల్లాడికి నచ్చడం ఏంటి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఈ చిత్రం తో పాటు కాజల్ అగర్వాల్ నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది వరకే బాలయ్య తో ఆమె ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ రెండవ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular