Flipkart Freedom Sale : త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో వ్యాపారం కూడా పుంజుకోనుంది. కొన్ని కంపెనీలు వ్యాపార సంస్థలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. అయితే మిగతా వాటి కంటే ముందుగానే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కొన్ని వస్తువులపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్’ తేదీను అధికారికంగా ప్రకటింది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇంటికి సంబంధించిన వస్తువులపై తగ్గింపు ధరలను ప్రకటించనుంది. ఈ సేల్స్ వివరాల్లోకి వెళితె..
ఆన్ లైన్ లో షాపింగ్ చేసేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా వచ్చే ఆగస్టు 8వ తేదీన ‘ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్’ ను ప్రారంభించనున్నారు. ఈ సేల్స్ లో భాగంగా ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25, మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, శాంసంగ్ గెలాక్సీ టామ్ ఏ11 ప్లస్ వంటి ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు స్మార్ట్ టీవీలు, ల్యాప్ ట్యాప్ లు, ఆడియో డివైజ్ లపై కూడా తగ్గింపు ఉండే అవకాశం ఉంది. ఇంట్లో వాడుకునే వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషన్లపై దాదాపు 50 శాతం తగ్గే అవకాశం ఉంది.
అయితే ఈ సేల్స్ ప్రారంభం కంటే ముందే అంటే ఆగస్టు 7వ తేదీ నుంచే ఎక్సక్లూజివ్ ఎర్లీ యాక్సెస్ అవకాశం లభిస్తుంది. అంటే ఫ్లిఫ్ కార్ట్ ప్లస్, ఫ్లిప్ కార్ట్ బ్లాక్ సభ్యులు ముందుగానే యాక్సెస్ అయి వీటిపై ఆఫర్ కొనేందుకు అర్హత సాధించవచ్చు. అంతే ఉత్పత్తుల స్టాక్ ముగిసే లోపే ఈ మెంబర్లు డీల్ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ సేల్ లో భాగంగా బ్యాంకు ఆఫర్లు కూడా వర్తిస్తాయి. ఎస్ బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వారు అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్ తీసుకువస్తే ఎక్చేంజ్ ఆఫర్ ను పొందుతారు. నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉండనుంది.