YouTube Earnings నేటి కాలంలో చాలా మంది డిజిటల్ మాధ్యమాల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. వీటిలో యూట్యూబ్, ఇన్ స్ట్రాగ్రామ్, ఫేస్ బుక్ వంటివి ఉన్నాయి. అయితే అప్పుడప్పుడూ వినే మాట ఏంటంటే.. ఒక వీడియో వైరల్ అయిందని.. ఆ వీడియో వైరల్ కావడంతో క్రియేటర్ కు ఎంత లాభం వస్తుంది? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కొంత మంది తెలుపుతన్న ప్రకారం.. మిలియన్లలో వ్యూస్ వస్తేనే ఆదాయం ఉంటుందని చెబుతున్నారు. ఉదాహరణఖు ఒక మిలియన్ కు రూ.60 నుంచి 70 వేల ఆదాయం వస్తుందని అనుకుందాం. అయితే ఈ వీడియోలో RPMఅనేది కీలకంగా మారుతుంది. ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చినా.. ఇది లేకపోతే ఆదాయం రాదు. అసలు ఆర్పీఎం అంటే ఏమిటీ?
యూట్యూబ్ ఆదాయం ఎలా వస్తుంది?
చాలా మంది YouTubeలో వీడియోలు పోస్టు చేసి సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్లాట్ ఫాంపై కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందిన వారు ఉన్నారు. కొందరు అనుభవం ఉన్న వారు చెబుుతున్న ప్రకారం.. 1 మిలియన్ అంటే 10 లక్షల వ్యూస్ అని అర్థం. ఒక వీడియోకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం ఒకే మొత్తంగా ఉండదు. భారతీయ ప్రేక్షకులు ఎక్కువగా ఉన్న సాధారణ ఎంటర్‌టైన్‌మెంట్, వ్లాగింగ్, కామెడీ, జనరల్ కంటెంట్ వీడియోలకు 10 లక్షల వ్యూస్‌పై సుమారుగా 500 డాలర్లు (రూ.47,827.05) నుంచి 3,000 డాలర్లు (2,86,962.30) వరకు ప్రకటన ఆదాయం రావచ్చని అంచనా వేయవచ్చు. అయితే ఫైనాన్స్, ఇన్సూరెన్స్, టెక్నాలజీ, బిజినెస్ వంటి అధిక ప్రకటన విలువ ఉన్న కేటగిరీల్లో ఆదాయం దీనికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి దేశాల ప్రేక్షకులు అధికంగా ఉన్నప్పుడు కూడా RPM సాధారణంగా మెరుగ్గా ఉండొచ్చు.
వీడియో తీయడానికి ఎలాంటి ఖర్చులు ఉంటాయి?
వీడియో ఆదాయాన్ని లెక్కించేటప్పుడు తయారీ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చిన్న క్రియేటర్ స్వయంగా మొబైల్ ఫోన్‌తో వీడియో తీస్తే కెమెరామెన్, ఎడిటర్ వంటి అదనపు ఖర్చులు ఉండకపోవచ్చు. కానీ ప్రొఫెషనల్ వీడియో అయితే కెమెరా, లైటింగ్, మైక్, షూటింగ్ లొకేషన్, ప్రయాణం, ఫుడ్, సిబ్బంది, ఎడిటింగ్, థంబ్‌నెయిల్ డిజైన్, స్క్రిప్ట్ రైటింగ్, ప్రమోషన్ వంటి వాటికి ఖర్చు అవుతుంది. ఒక సాధారణ యూట్యూబ్ ను వీడియోను స్వయంగా రూపొందించే క్రియేటర్‌కు ఒక్క వీడియోకు రూ.2 వేల నుంచి రూ.20,000 వరకు ఖర్చు కావచ్చు. ప్రొఫెషనల్ టీమ్‌తో రూపొందించే వీడియోలకు రూ.5వేల నుంచి రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు కావచ్చు. భారీ సెటప్, ప్రయాణాలు, నటీనటులు, ప్రత్యేక ప్రదేశాలు లేదా భారీ ప్రొడక్షన్ ఉంటే ఖర్చు మరింత పెరుగుతుంది.
ఖర్చులు పోగా లాభం ఎంత?
ఉదాహరణకు ఒక వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చి ప్రకటనల ద్వారా రూ.1,50,000 ఆదాయం వచ్చిందని అనుకుందాం. ఆ వీడియో తయారీకి రూ.20,000 ఖర్చయితే, ఇతర ప్రత్యక్ష ఖర్చులు మినహాయించిన తర్వాత సుమారుగా రూ.1,20,000 మిగిలే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రొఫెషనల్ వీడియో తయారీకి రూ.95,000 ఖర్చు చేసి, ప్రకటనల ద్వారా రూ.1,50,000 వస్తే లాభం చాలా తక్కువగా ఉంటుంది. అంటే 1 మిలియన్ వ్యూస్ వచ్చిందంటే తప్పనిసరిగా భారీ లాభం వచ్చిందని అర్థం కాదు.
అదే వీడియోకు యూ ట్యూబ్ ప్రకటనలతో పాటు స్పాన్సర్‌షిప్, బ్రాండ్ ప్రమోషన్, అఫిలియేట్ మార్కెటింగ్, మెంబర్‌షిప్‌లు, సొంత ఉత్పత్తుల విక్రయం వంటి అదనపు ఆదాయ మార్గాలు ఉంటే క్రియేటర్ లాభం భారీగా పెరగవచ్చు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో స్పాన్సర్‌షిప్ ద్వారా వచ్చే మొత్తం, యూట్యూబ్ ప్రకటన ఆదాయం కంటే ఎక్కువగా ఉండొచ్చు.
ఎన్ని వ్యూస్ వస్తే బాగా లాభపడతారు?
క్రియేటర్‌కు లాభం రావడానికి ఒక నిర్దిష్ట వ్యూస్ సంఖ్యను చెప్పడం సాధ్యం కాదు. తక్కువ వ్యూస్ వచ్చినా అధిక ఆర్పీఎం ఉన్న కేటగిరీలో వీడియో ఉంటే మంచి ఆదాయం రావచ్చు. ఉదాహరణకు ఫైనాన్స్, ఇన్సూరెన్స్, బిజినెస్, టెక్నాలజీ వంటి కేటగిరీల్లో తక్కువ వ్యూస్‌తోనే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు వైరల్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోకు లక్షల వ్యూస్ వచ్చినా ఆర్పీఎం తక్కువగా ఉంటే ఆదాయం పరిమితంగా ఉండవచ్చు. సాధారణంగా ఒక క్రియేటర్‌కు 1 లక్ష వ్యూస్ వచ్చినప్పుడు ఆదాయం ప్రారంభమవుతుంది. 5 లక్షల నుంచి 10 లక్షల వ్యూస్ దాటితే, వీడియో తయారీ ఖర్చు తక్కువగా ఉన్నప్పుడు మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. 10 లక్షలు, 50 లక్షలు లేదా 1 కోటి వ్యూస్ సాధించినప్పుడు ప్రకటన ఆదాయంతో పాటు స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తే క్రియేటర్‌కు భారీ ఆదాయంగా మారవచ్చు.
ఆదాయంలో ఆర్పీఎం కీలకం..
యూ ట్యూబర్ ఆదాయాన్ని అర్థం చేసుకోవడంలో RPM (Revenue Per Mille) చాలా కీలకం. అంటే ప్రతి 1,000 వ్యూస్‌కు క్రియేటర్‌కు వాస్తవంగా ఎంత ఆదాయం వస్తుందనేది ఆర్పీఎం ద్వారా తెలుస్తుంది. సీపీఎం అనేది ప్రకటనదారులు చెల్లించే మొత్తానికి సంబంధించినది కాగా, ఆర్పీఎం క్రియేటర్‌కు వాస్తవంగా వచ్చే ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఒకే 10 లక్షల వ్యూస్ వచ్చిన రెండు వీడియోలకు ఆదాయం ఒకేలా ఉండదు.