Ranbir Kapoor : మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో రామాయణం మీద ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి. అన్నీ దాదాపుగా సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి, ఒక్క ‘ఆదిపురుష్’ తప్ప. మన టాలీవుడ్ రామాయణం మీద సరైన సినిమాలు వచ్చింది ఎన్టీఆర్ కాలం లోనే. నేటి తరం లో ‘ఆదిపురుష్’ చిత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది అనుకుంటే., చరిత్ర ని వక్రీకరిస్తూ, ఇష్టమొచ్చిన విధంగా సినిమాని తీసి, హీరో ప్రభాస్ పైన కూడా అందరూ విరుచుకుపడేలా చేశాడు డైరెక్టర్. ఈ చిత్రాన్ని వాల్మీకీ రామాయణం లో ఉన్నది ఉన్నట్టుగా చక్కటి ఎమోషన్స్ తో, అద్భుతమైన గ్రాఫిక్స్ తో తీసి ఉండుంటే, మూడు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతటి పొటెన్షియల్ ఉన్న సబ్జెక్టు ఇది. బంగారం లాంటి అవకాశాన్ని ప్రభాస్ మిస్ చేసుకున్నాడు. అయితే ఈ కథని ఉన్నది ఉన్నట్టుగా తీసి ఆడియన్స్ కి అందించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి(Nitish Tiwari).
Also Read ; శ్రీవిష్ణు ‘సింగిల్’ మూవీ మొట్టమొదటి రివ్యూ..ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు!
ఇందులో శ్రీరాముడిగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించబోతున్నాడు. సీతగా సాయి పల్లవి(Sai Pallavi), రావణాసురుడిగా కన్నడ సూపర్ స్టార్ యష్(Rocking Star Yash), హనుమంతుడిగా సన్నీ డియోల్(Sunny Deol) కనిపించబోతున్నారు. ఇక ఇన్ని రోజులు హీరోయిన్ పాత్రల ద్వారా యూత్ ఆడియన్స్ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), ఈ చిత్రం లో సూర్పనక్క గా నటించబోతుంది. ఇదే ఆమెకు మొట్టమొదటి విలన్ పాత్ర అనుకోవచ్చు. ఈ చిత్రాన్ని మొత్తం మీద రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది దీవాలి కానుకగా విడుదల చేయబోతుండగా, రెండవ భాగాన్ని 2027 దీవాలి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని క్వాలిటీ పరంగా ఎక్కడా కూడా తగ్గకుండా ఉండేలా ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకుంటున్నారు. సుమారుగా 600 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా జరిగిన వేవ్స్ సమ్మిట్ లో విడుదల చేస్తామని మేకర్స్ చెప్పారు. విడుదల చేసారో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియా లో మాత్రం విడుదల కాలేదు. అయితే అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే, వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని అంటున్నారు. తేదీని త్వరలోనే ప్రకటిస్తారట. ఇప్పటికే రణబీర్ కపూర్ , సాయి పల్లవి సీతారాముల గెటప్స్ లో ఉన్న షూటింగ్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. కానీ ఆ ఫోటోలలో ఎలాంటి క్లారిటీ లేదు కానీ, ఇద్దరు గెటప్స్ లో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారని మాత్రం చెప్పొచ్చు.
Also Read : అలాంటి డ్రామాలు ఆడడం నాకు రాదు అంటూ కేతిక శర్మ స్ట్రాంగ్ కౌంటర్!