Naga Chaitanya: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో స్టార్ హీరోలు గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. మీడియం రేంజ్ హీరోలు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిమితవుతూ వాళ్ళ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఇంటర్వ్యూ ఇచ్చిన నాగచైతన్య సైతం ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సినిమా చేస్తున్నాడు. కార్తీక్ దండు ఇంతకుముందు ‘వీరూపాక్ష’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. కాబట్టి అతనికి ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కించి నాగచైతన్యకు భారీ విజయాన్ని కట్టబెడతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల కంటే కూడా నాగచైతన్యకు ఎక్కువగా ఆస్తులు ఉన్నాయంటూ కొన్ని కామెంట్లు వస్తున్నాయి. నిజానికి నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీ హీరో కాబట్టి అతనికి వారసత్వంగానే వేలకోట్ల ఆస్తులైతే ఉన్నాయి. కానీ తన స్వతహాగా కూడా కొన్ని బిజినెస్ లను చేస్తున్నాడు. అలాగే సినిమాల ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు.
ప్రస్తుతం తన సొంతంగానే దాదాపు 2000 కోట్ల వరకు ఆస్తులైతే పోగేసినట్టుగా తెలుస్తుంది. బిజినెస్ విషయంలో సైతం నాగచైతన్య చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. తన ప్రతి విషయాన్ని కూడా నాగార్జునతో చర్చించి మరి బిజినెస్ లను సక్సెస్ ఫుల్ గా డీల్ చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నాగార్జున మొదటి నుంచి కూడా బిజినెస్ మైండ్ కాబట్టి ప్రతి దాన్ని బిజినెస్ కోణంలోనే ఆలోచిస్తుంటాడు.
అందుకే ఆయన ఆ రేంజ్ లో ఆస్తులునైతే కూడగట్టుకున్నాడనేది వాస్తవం…చూడాలి మరి రాబోయే రోజుల్లో నాగ చైతన్య ఎలాంటి సినిమాలను చేస్తాడు ఏ రేంజ్ కలెక్షన్స్ ను కొల్లగొడుతాడు అనేది… ప్రస్తుతం ఆయన ఆశలన్నీ వృషకర్మ సినిమా మీదనే ఉన్నాయి…