Naga Chaitanya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వరరావు దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న అఖిల్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వారే కావడం విశేషం.. ముఖ్యంగా నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున రొమాంటిక్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా మాస్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి నాగార్జున కొడుకులైన నాగచైతన్య, అఖిల్ సైతం ఈ జనరేషన్లో అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతం నాగచైతన్య డిఫరెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మొదట సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె నుంచి డివోర్స్ తీసుకొని శోభితా ధూళిపాళ్ల ను రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఒకానొక సందర్భంలో నాగచైతన్య వాళ్ళ మేనమామ కూతురు అయిన వెంకటేష్ బిడ్డని పెళ్లి చేసుకోవచ్చు కదా అనే వార్తలైతే వచ్చాయి.
కానీ వెంకటేష్ కూతురుతో నాగచైతన్య చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటూ పెరిగాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం కూడా అతనికి పెద్దగా లేదట. అందరు కలిసిమెలిసి ఉండేవారు కాబట్టి తన మీద అతనికి అలాంటి ఫీలింగ్స్ లేకపోవడంతో ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత సమంతను ప్రేమించాడు.
అలా తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి వెంకటేష్ సైతం తన కూతుర్ని పెళ్లి చేసుకోమని నాగచైతన్య ను అడగలేదు.
నాగ చైతన్య కు కూడా ఎలాగూ తనకు అలాంటి ఉద్దేశం లేదు కాబట్టి ఆయన కూడా ఆ ప్రస్తానన తీసుకురాకపోవడంతో వెంకటేష్ కూతురును నాగచైతన్య పెళ్లి చేసుకోలేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం నాగ చైతన్య తన ఫ్యామిలీ లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూనే డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం.. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో స్టార్ హీరోగా మారతాననే ఒక కాన్ఫిడెన్స్ ను బాగా చైతన్య వ్యక్తం చేస్తున్నాడు..