Homeఎంటర్టైన్మెంట్Korean Kanakaraju Collections: 10 కోట్ల గ్రాస్ అన్నారు.. కానీ 'కొరియన్ కనకరాజు' మొదటి రోజు...

Korean Kanakaraju Collections: 10 కోట్ల గ్రాస్ అన్నారు.. కానీ ‘కొరియన్ కనకరాజు’ మొదటి రోజు రాబట్టిన నిజమైన కలెక్షన్స్ ఎంతంటే..

Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ నిన్న భారీ లెవెల్ లో విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా స్టోరీ పరంగా అనేక విమర్శలు వచ్చిన విషయం వాస్తవమే కానీ , కామెడీ బాగా వర్కౌట్ అవ్వడం తో ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ బాగా వ్యాప్తి చెందింది. ఫలితంగా ఈ చిత్రం ఓవరాల్ […]

Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ నిన్న భారీ లెవెల్ లో విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా స్టోరీ పరంగా అనేక విమర్శలు వచ్చిన విషయం వాస్తవమే కానీ , కామెడీ బాగా వర్కౌట్ అవ్వడం తో ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ బాగా వ్యాప్తి చెందింది. ఫలితంగా ఈ చిత్రం ఓవరాల్ వరల్డ్ వైడ్ గా మంచి ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకుంది. మేకర్స్ ఈ చిత్రానికి 10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు పోస్టర్ ని విడుదల చేశారు కానీ , ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి మొదటి రోజు 1 కోటి 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. వరుణ్ తేజ్ గత చిత్రం ‘మట్కా’ కి క్లోజింగ్ లో కూడా ఇంత వసూళ్లు రాలేదట. అదే విధంగా సీడెడ్ లో 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట. వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కి , పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ కూడా ఈ రేంజ్ ఓపెనింగ్ రావడం గొప్ప విషయమే. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే 1 కోటి 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ ప్రాంతాల నుండి ఈ చిత్రానికి 3 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 5 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.

ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్ర/ తెలంగాణ విషయానికి వస్తే , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 23 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓవర్సీస్ నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 4 కోట్ల 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 7 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి విడుదలకు ముందు 13 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మరో 9 కోట్ల 26 లక్షల షేర్ ని రాబడితే సూపర్ హిట్ రేంజ్ కి వెళ్ళినట్టే. రేపటితో అవలీలగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper