Bigg Boss Telugu 10: గత ‘బిగ్ బాస్’ సీజన్ సెన్సేషనల్ హిట్ అవ్వడం తో , సెప్టెంబర్ 6 న మొదలు అవ్వబోయే ‘బిగ్ బాస్ 10’ ని మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు చాలా కఠినంగా , ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయని హోస్ట్ నాగార్జున రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా కంటెస్టెంట్స్ విషయం లో అసలు తగ్గడం లేదట బిగ్ బాస్ టీం. అందుకే ‘అగ్ని పరీక్ష 2’ లో కూడా కేవలం సామాన్యులను మాత్రమే కాకుండా, పాపులర్ ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీలకు అవకాశాలు ఇస్తున్నారు. ఇక సెలబ్రిటీ క్యాటగిరీ లో అయితే మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్లనే తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే కొన్ని పేర్లను మీరంతా సోషల్ మీడియా లో వినే ఉంటారు.
లేటెస్ట్ గా సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ని మేకర్స్ దాదాపుగా ఖరారు చేశారట. అయితే ఈ లిస్ట్ లో ఒక కంటెస్టెంట్ పేరు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రతీ సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా జబర్దస్త్ నుండి ఒక టాప్ కమెడియన్ ని తీసుకొని రాబోతున్నారట. ఆ కమెడియన్ మరెవరో కాదు.. ఆటో రామ్ ప్రసాద్.. రీసెంట్ గానే బిగ్ బాస్ టీం ఇతన్ని సంప్రదించగా , ఆయన కూడా కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు సుముఖత చూపించినట్టు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ కూడా ఆయనకు భారీ రేంజ్ లోనే ఆఫర్ చేశారట. సోషల్ మీడియా తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాంప్రసాద్ బిగ్ బాస్ షో లోకి వస్తే కమెడియన్స్ క్యాటగిరీలో టైటిల్ విన్నర్ గా నిలిచే మొట్టమొదటి కంటెస్టెంట్ గా అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇదే జబర్దస్త్ షో క్యాటగిరీలో నూకరాజు ని కూడా తీసుకుంటున్నారట. ఒక సీజన్ లో జబర్దస్త్ షో కి సంబంధించిన ఇద్దరు కమెడియన్స్ ని తీసుకోవడం సీజన్ 6 తర్వాత దీనికే జరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది , వీళ్ళిద్దరిలోనూ కామెడీ టైమింగ్ పీక్ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ టీం కి ఈ రేంజ్ పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే అందుకు ముఖ్య కారణం ఆటో రాంప్రసాద్. ఆయనే స్కిట్స్ అన్ని రాస్తుంటాడు. అలాంటి రాంప్రసాద్ ‘బిగ్ బాస్ 10’ లోకి వస్తున్నాడంటే , ఎంటర్టైన్మెంట్ మామూలు రేంజ్ లో ఉండదు అనే చెప్పాలి.