Agni Pareeksha 2: కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ వచ్చే నెల 6 వ తేదీన స్టార్ మా ఛానల్ లో గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. ఇక ఈ సీజన్ లో కూడా గత సీజన్ లో లాగానే ‘అగ్ని పరీక్ష 2’ షో ద్వారా సామాన్యులను కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో కి సంబంధించిన షూటింగ్ ని గత మూడు రోజులుగా చేస్తున్నారు. ఆగస్టు 15 న స్టార్ మా , జియో హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవ్వబోయే ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ని కూడా నిన్ననే విడుదల చేశారు. అయితే ఈ షో షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియా లో ప్రతీ రోజు లీక్ అవుతూనే ఉన్నాయి.
మొదటి మూడు రోజుల్లో చివరి రౌండ్ కి నేరుగా సెలెక్ట్ అయినవాళ్లు ఉన్నారు , రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మొదటి రెండు ఎపిసోడ్స్ కి సంబంధించిన అప్డేట్స్ ని ఇప్పటికే మీకు అందించాము. ఇక మూడవ రోజు షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మూడవ రోజు షూటింగ్ లో అత్యధిక శాతం రిజెక్ట్ అయినా వాళ్ళే ఉన్నారట. అయితే ఈ షూటింగ్ లో ‘బిగ్ బాస్ 9’ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల తో పాటు , టాప్ 3 కంటెస్టెంట్ గా నిల్చిన డిమోన్ పవన్ కూడా పాల్గొన్నారట. వీళ్ళు అక్కడికి ఆడిషన్స్ కోసం వచ్చిన సామాన్యులకు మోటివేషన్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు టాక్. దీనికి సంబంధించిన ప్రోమో కూడా త్వరలోనే రాబోతుంది అట.
ఇక మూడవ రోజు షూటింగ్ లో సెలక్షన్ , రిజెక్షన్ ప్రక్రియ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. షాలిని , లవ్లీ చిన్ని , రామకృష్ణ వంటి వారిని నిన్న జరిగిన ఎపిసోడ్ షూటింగ్ లో ముగ్గురు జడ్జీలు రెడ్ ఫ్లాగ్ ఇచ్చి రిజెక్ట్ చేశారట. ఇక జడ్జీలు రెండు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి హోల్డ్ లో పెట్టిన కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే ఐశ్వర్య లేడీ క్రికెటర్ , భాగీ తుళ్లూరి , జోష్నా రెడ్డి, షాలిని పటేల్ వంటి వారు ఉన్నారట. వీళ్లంతా తదుపరి రౌండ్ లో పాల్గొనబోతున్నారు. ఇక కేవలం ఒక్క గ్రీన్ ఫ్లాగ్ ని సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ నవరసాల మామ ఆర్కే , దీపక్ , రమ్య , గౌరీ త్రినేత్ర. వీళ్ళు కూడా తదుపరి రౌండ్ లో పాల్గొనబోతున్నారు.