Homeఎంటర్టైన్మెంట్Gamanam: అప్పటినుంచే డైరక్టర్​ కావాలని ఫిక్స్ అయ్యా- గమనం దర్శకురాలు

Gamanam: అప్పటినుంచే డైరక్టర్​ కావాలని ఫిక్స్ అయ్యా- గమనం దర్శకురాలు

Gamanam: పలు ఉపకథల సమ్మేళనంగా తెరకెక్కించిన చిత్రం” గమనం”.ఈ డిసెంబరు 10న థియేటర్ లో సందడి చేయనుంది. ప్రధాన పాత్రలో శ్రియ, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి, నిత్యామేనన్‌ నటించారు.ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.క్రియ ఫిల్మ్‌ క్రాప్‌, కాళీ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మించారు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

gamanam-movie-director-latest-interview

ఈ సందర్భంగా విలేకరులతో సినిమా ముచ్చట్లు ముచ్చటించారు దర్శకురాలు సృజనా రావు.జీవిత ప్రయాణం గురించి చెప్పడమే “గమనం” పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే జీవిత సంఘటనలను చూపించాలనుకున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్రకు ఓ ప్రయాణం ఉంటుంది అని డైరెక్టర్‌ సృజనా రావు అన్నారు.తొలుత సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ఉండేది అయితే ముందు మా ఇంట్లో చెప్పలేదు. తర్వాత నేను తీసిన డాక్యుమెంటరీని మా నాన్నగారికి చూపించాను. ‘నేనైతే హెల్ప్‌ చేయను కానీ నువ్వే కష్టపడి ప్రూవ్‌ చేసుకోవాలి’ అని నాన్న చెప్పారు ఆ తర్వాత నాన్న సపోర్ట్‌ చేశారు.

చిన్నప్పుడు మా నాన్నతో పాటు షూటింగ్‌లకు వెళ్లినప్పుడు సెట్‌లో ఎవరెవరు ఏమేం చేయాలో చెప్పేది దర్శకుడే అని గ్రహించాను. అప్పటినుండి డైరెక్టర్‌ అవ్వాలనుకున్నాను. నా చిన్నతనం నుండి చూస్తూ వచ్చిన వాస్తవ సంఘటనలన్నీ ‘గమనం’లో ఉంటాయి. ముందుగా స్క్రిప్ట్‌ రాసుకున్నప్పుడు నటీనటులను అనుకుని రాయలేదు. ఈ కథ శ్రియకి చెప్పగానే ఎమోషనల్ అయ్యి నన్ను గట్టిగా హత్తుకున్నారు.ఈ కథ ఇళయరాజాగారికి చెప్పడానికి వెళ్లినప్పుడు ‘నన్నే సంగీతదర్శకుడిగా ఎందుకు అనుకుంటున్నావు?’ అని అడిగారు.ఆయనకు కథ చెప్తున్నప్పుడు మధ్యలో ‘మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రం తర్వాత మరో కథను సిద్ధం చేసుకున్నాను త్వరలో దాని గురించి అధికారిక ప్రకటన చేయను ఉన్నాను అని చెప్పుకొచ్చారు దర్శకురాలు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper