Homeఎంటర్టైన్మెంట్Actress Shriya: నా కూతురు రాధ గర్వపడేలా ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేయాలనుకుంటున్నాను: శ్రియా

Actress Shriya: నా కూతురు రాధ గర్వపడేలా ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేయాలనుకుంటున్నాను: శ్రియా

Actress Shriya: శ్రియా శరన్ “ఇష్టం” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమా తర్వాత విడుదలైన “సంతోషం” సినిమాతో వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లారు ఈ అమ్మడు. అయితే 2017లో విడుదలైన “పైసా వసూల్” చిత్రంతో సినీ ప్రయాణానికి కాస్త విరామం ఇచ్చారు. ప్రస్తుతం లేడీ డైరెక్టర్ సంజనా రావు దర్శకత్వంలో శ్రియా, శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్‌, నిత్యా మీనన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం”గమనం”.  రమేశ్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌  ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమాను డిసెంబర్ 10న విడుదల కానున్న సందర్భంగా సినిమా విశేషాలను చెప్పుకొచ్చారు శ్రియా.

Actress Shriya
actress shriya interesting words about her role in gamanam movie

Also Read: సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పై బోల్డ్‌గా స్పందించిన పాయ‌ల్…

సినిమాల పట్ల నా ఆలోచనా విధానం మారింది నా కుటుంబం, నా కూతురు రాధ నా సినిమాలను చూసి గర్వపడేలా చాలెంజింగ్‌ రోల్స్‌ తో మనసుకు నచ్చిన పాత్రలే చేస్తాను. ఈ సినిమాలో దివ్యాంగురాలు అనే కమల పాత్రలో కనిపిస్తాను కమలకు వినపడదు కానీ మాట్లాడుతుంది. ఈ సినిమా కథ విన్నప్పుడు ఏడ్చాను. అలానే కమల పాత్రకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. మహిళా దర్శకులతో వర్క్‌ చేయడం నాకు కొత్త కాదు. తెలుగులో లేడీ డైరెక్టర్‌ తెరకెక్కించిన సినిమా చేయడం నాకిదే తొలిసారి. ఈ సినిమాకు ఇళయరాజా గారితో వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారు చివరి క్షణం వరకు నటించారు. ఆయనలా నాక్కూడా చివరి క్షణం వరకూ నటించాలని ఉంది. ‘మనం’ సినిమా సమయంలో ‘ఒకవేళ నేను చనిపోతే ఈ సినిమా చేసే చనిపోతాను’ అని ఆయన అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. మా పాప రాధ వచ్చిన తర్వాత మా జీవితం మారిపోయింది. కథక్‌ డ్యాన్స్‌ నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తే చేయాలని ఉంది అని మనసులో మాటను బయట పెట్టారు శ్రియా.

Also Read: ప్యారిస్​లో రష్మిక హాలిడే ట్రిప్​.. అక్కడ ఏం చేస్తోందో తెలుసా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular