Niharika – Chaitanya: మెగా డాటర్ నిహారిక చిలిపిదనం.. చలాకీదనం గురించి అందరికీ తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు పెళ్లి ఎంతో ఘనంగా పోయిన సంవత్సరం జరిగింది. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లు ఇతర మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. గుంటూరు మాజీ డీఐజీ కుమారుడు చైతన్యతో నిహారిక వివాహం జరిగింది.

ఈ డిసెంబర్ తో వీరి పెళ్లి జరిగి ఏడాది. ఈ క్రమంలోనే తమ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఈ జంట స్పెయిన్ వెళ్లింది. అక్కడ సుందర ప్రదేశాలను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. మరో వారంలో వీరి వివాహ వార్షికోత్సవ వేడుకను స్పెయిన్ లోని బార్సిలోనోలో చేసుకోబోతున్నారట..
పెళ్లి తర్వాత భర్త చైతన్య కోరిక మేరకు సినిమాలను పూర్తిగా తగ్గించేసింది నిహారిక. భర్తతో లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ నిర్మాణరంగంలో, వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. ఇక తన భర్తతో పర్సనల్ లైఫ్ ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తోంది. భర్తతో ఆనందంగా గడుపుతోంది. ఇటీవలే వీరు ఒక సొంత ఇండిపెండింట్ ఇంటికి మారి వేరు కాపురం పెట్టారు.
తాజాగా స్పెయిన్ లోని బార్సిలోనా వెళ్లిన నిహారిక-చైతన్య దంపతులు అక్కడ సుందర ప్రాంతాలను సందర్శిస్తూ ఫొటోలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. ఆహారం ముందే ఉన్నా తినకుండా నిహారిక ఫోన్ లోనే బిజిబిజీగా గడిపింది.
నిహారిక 24 గంటలూ అదే ఫోన్ లో పడిపోతోందని.. ఒక వ్యసనంలా ఫోన్ ను మార్చుకుందని.. అదే పనిగా ఫోన్ చూస్తోందని భర్త చైతన్య ఆ ఫొటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ఎప్పుడూ అదే పని.. ప్రతి నిమిషం ఫోన్ లో ఇలా బిజీగా ఉందంటూ’ ఫొటోలు షేర్ చేసి నిహారిక పరువు తీశాడు భర్త చైతన్య. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత అంటూ మరో ఫొటోనుకూడా తీసి పంచుకున్నాడు. ఇలా ఫోన్ వ్యసనంతో తన భార్య 24 గంటలూ అదే పని పెట్టుకుందని సోషల్ మీడియా సాక్షిగా చైతన్య బయటపెట్టాడు. దీనిపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. భర్తతో టూర్ కు వెళ్లి ఇదేం పని అమ్మా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.