Homeఎంటర్టైన్మెంట్Funky Movie First Review: 'ఫంకీ' మూవీ ఫస్ట్ రివ్యూ... హిట్టా? ఫట్టా?

Funky Movie First Review: ‘ఫంకీ’ మూవీ ఫస్ట్ రివ్యూ… హిట్టా? ఫట్టా?

Funky Movie First Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న క్రమంలో అనుదీప్ లాంటి దర్శకుడు మాత్రం కామెడీ దర్శకుడిగా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను ఏర్పరుచుకున్నాడు…అతనికి ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ ఉంది. ఇక తన సినిమాలో ప్రతి డైలాగు ఒక పంచ్ గానే ఉంటుంది. అలాగే కామెడీని జనరేట్ చేయడంలో కూడా ఆయనకు చాలా మంచి గ్రిప్ ఉంది. ప్రస్తుతం ఆయన విశ్వక్ సేన్ ను హీరోగా పెట్టి ‘ఫంకీ’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న సందర్భంలో ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేసి మరి చూపించారట. వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడికి నచ్చే విధంగా ఉందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

కోమల్ (విశ్వక్ సేన్) అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమాని డైరెక్ట్ చేయడానికి కొంతమంది దగ్గర డీల్స్ మాట్లాడుకుంటాడు. కోటి రూపాయల్లో సినిమా చేస్తానని చెప్పి సినిమా అనేది స్టార్ట్ చేస్తాడు. మొత్తానికైతే అతను ఆ కోటి రూపాయల్లో సినిమాని ఫినిష్ చేశాడా? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ మూవీ విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతి సన్నివేశాన్ని కామెడీతో నింపేశాడు..ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోయిన కూడా మొదటి నుంచి చివరి వరకు సినిమాను ఎంటర్ టైనింగ్ గా తీసుకెళ్లడంతో సగటు ప్రేక్షకులందరికి ఈ సినిమాని నచ్చుతుంది అంటూ ఈ మూవీ ని చూసిన సినీ ప్రముఖులు చెబుతున్నారు… ఇక అనుదీప్ మార్క్ డైలాగ్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ఇంతకుముందు ఆయన చేసిన ‘జాతి రత్నాలు’ సినిమా ఫ్లేవర్ లోనే ఈ సినిమా కూడా నడుస్తుంది.

ఈ సినిమాతో విశాల్ సేన్ తన పూర్తిస్థాయి కామెడీ టైమింగ్ ని కూడా మెరుగుపరుచుకున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఫస్టాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను చాలావరకు ఎంటర్టైన్ చేస్తాయట. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకుడి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అంటూ చాలామంది సినిమా ప్రముఖులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం.

ఇక ఏది ఏమైనా కూడా అనుదీప్ విశ్వక్ సేన్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధించబోతున్నారు అంటూ మూవీ చూసిన వాళ్లందరూ చెబుతున్నారు. ఇక విశ్వక్ సేన్ ఇంతకు ముందు మాస్ సినిమాలను చేస్తూ వచ్చాడు. కానీ మొదటిసారి జానర్ మార్చి కామెడీ సినిమాని చేయడం అనేది అతనికి ఒక బెస్ట్ అటెంప్ట్ అనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper