Chicken: ఆదివారం వచ్చిందంటే మాంసాహారం తప్పనిసరిగా ఉండాలని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. వీటిలో తక్కువ ధరకు లభించే చికెన్ తినాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే కోడిలోని కొన్ని పార్ట్స్ మాత్రమే తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వెళ్తాయి. మరికొన్ని అవయవాల్లో బ్యాక్టీరియా విపరీతంగా ఉంటుంది. ఇవి వేడి చేసినా కూడా నశించే అవకాశం ఉండదు. అంతేకాకుండా చికెన్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గుండె జబ్బు సమస్య ఉన్నవారు స్కిన్ తో కూడిన చికెన్ తినడం అంత మంచిది కాదు అని వైద్యులు అంటున్నారు. ఇంకా చికెన్ లోని ఎటువంటి పార్ట్స్ తింటే డేంజరో ఇప్పుడు చూద్దాం..
తల:
కోడికి సంబంధించిన తలను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే కోళ్లకు ఇచ్చే ఆహారంలో పెస్టిసైడ్స్ లేదా రసాయనాల అవశేషాలు ఉంటాయి. కోడి తలలో చిన్న కణితులు, మలినాలు ఉండే ప్రమాదం ఉంది. దీనిని శుభ్రపరిచే విధానం సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాంటప్పుడు దీనిని పూర్తిగా దూరం పెడితేనే మంచిదని అంటున్నారు.
లంగ్స్:
కోళ్లలోని లంగ్స్ ను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని అంటున్నారు. ఎందుకంటే ఇందులో సూక్ష్మజీవులు, రామ జీవులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కోడి శ్వాస ద్వారా పీల్చుకున్న దుమ్ము, వైరస్, బ్యాక్టీరియా లంగ్స్ లో నిల్వ అయి ఉంటుంది. సాధారణంగా మాంసం బాగా ఉడికిస్తే సూక్ష్మజీవులు నశిస్తాయి. కానీ పూర్తిగా శుభ్రం చేయని పరిస్థితుల్లో ప్రమాదం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల లంగ్స్ ను తొలగించడమే మంచిదని అంటున్నారు.
కాళ్లు,వ్రేళ్ళు:
కోడికి సంబంధించిన కాళ్లు, వేళ్ళు దూరం పెట్టడమే మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఇవి రెండు ఎప్పుడూ నేలపై ఉంటాయి. వీటి మధ్య బ్యాక్టీరియా చేరి అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు వీటిని తినడం వల్ల ఆ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
స్కిన్ చికెన్:
స్కిన్ చికెన్ లో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది పూర్తిగా కొలెస్ట్రాల్ కాదు. కానీ సాచు రేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండడంతో కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు, గుండె జబ్బులు సమస్యలు ఉన్నవారు దీనిని తినడం వల్ల అధిక పోవు పేరుకపోయే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా చికెన్ లోని ఈ భాగాలను దూరం పెట్టడమే మంచిదని అంటున్నారు. చికెన్ తినాలని అనుకున్న సమయంలో తాజాగా ఉండేది చూసుకోవాలి. కనీసం 75 సెంటీగ్రేట్ ఉష్ణోగ్రతలో దీనిని ఉడికించాలి. మాంసం తాగిన పాత్రలను బాగా కడగాలి. ఫ్రిజ్లో సరైన ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి. అయితే చికెన్ తినడం వల్ల ఎంతో రుచిగా ఉండడంతో పాటు ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. కానీ దీనిని శుభ్రపరిచే విధానం సరిగా ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు..