Homeఎంటర్టైన్మెంట్Roja: ఎక్స్ట్రా జబర్దస్త్ లో హీరోయిన్ పరువు తీసిన రోజా.. జంతువుతో పోలుస్తూ?

Roja: ఎక్స్ట్రా జబర్దస్త్ లో హీరోయిన్ పరువు తీసిన రోజా.. జంతువుతో పోలుస్తూ?

Roja: ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజా మంత్రి పదవి దక్కడంతో సినిమాలకు, టీవీ షోలకు దూరమవుతున్నట్టు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రోజా పాల్గొన్న చివరి ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ నిన్న ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో స్పెషల్ స్కిట్ లో రోజా కూడా పాల్గొని సందడి చేశారు. ఈ షోలో క్యాష్ షో పేరడీ స్కిట్ చేయగా రోహిణి సుమలా యాక్ట్ చేశారు. రోజా రోహిణిని చూస్తూ క్యాష్ అంటే సుమ ఉంటుందని సుమో ఉందేంటని కామెంట్ చేశారు.

Roja
Roja

రష్మీ, పూర్ణ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వగా రోజా పూర్ణతో తాను జాంబి రెడ్డి సినిమా చూశానని చెబుతారు. తాను ఆ సినిమాలో నటించలేదని పూర్ణ చెప్పగా ఆ సినిమాలోని జాంబీల కంటే నువ్వే ఎక్కువగా కొరుకుతున్నావట కదా అని రోజా కామెంట్ చేశారు. రోజా అలా కామెంట్ చేయడంతో పూర్ణ బుంగమూతి పెట్టుకున్నారు. రోహిణి ఈ క్రింది జంటల్లో ఏ జంటను చూస్తే చిరాకు వేస్తుందని అడగగా ఇమ్ము వర్ష, సుధీర్ రష్మీ జంటలను లేపిన నన్ను చూస్తే నాకు చిరాకు వేస్తుందని రోజా చెబుతారు.

Also Read: Jeevitha Rajashekar: టాలీవుడ్‌లో కలకలం.. జీవితరాజశేఖర్‌ లపై కేసు !

పూర్ణ నాది ప్రదీప్ జోడీ ఎందుకు పెట్టలేదని అడగగా ఆ జోడీని పెట్టడానికి కూడా చిరాకు వేసి పెట్టి ఉండరని రోజా కామెంట్ చేశారు. తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలుగా మారడానికి ఎంత సమయం పడుతుందని రోహిణి అడగగా ఎంత సమయమో చెప్పాలని రోజా కామెంట్ చేశారు. రామ్ ప్రసాద్ ఈ ప్రశ్నకు జవాబు సుమకు తెలుసు అని చెప్పగా ఆ ప్రశ్న క్యాన్సిల్ అని రోహిణి చెబుతారు. ఆ తర్వాత రోహిణి సుమ బాస్కెట్ లీగ్ నిర్వహించగా మనో గారు మీవల్లే జబర్దస్త్ కు రాలేదా అని రోహిణి రోజాను అడుగుతారు.

రోజా మాట్లాడుతూ తోసితోసి చెయ్యి నొప్పి పుట్టడంతో ఆయన షోకు రాలేదని చెబుతారు. బాహుబలిలో అనుష్క పాత్ర చేస్తారా లేక శివగామి పాత్ర చేస్తారా అని రోహిణి రష్మీని అడగడంతో పాటు మీ వయస్సుకు శివగామి పాత్ర సెట్ అవుతుందని కామెంట్ చేశారు.

Also Read: Rashmi: తోబుట్టువులు చనిపోయారు.. దత్తత తీసుకోండి.. రష్మీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Recommended Videos:

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

3 COMMENTS

  1. […] Hero Suman: టాలీవుడ్ లో ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌తో పోటీ ప‌డిన హీరో సుమ‌న్.. త‌న గ్లామ‌ర్ న‌ట‌న‌తో ఎంతోమంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. సుమ‌న్ డేట్స్ కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూక‌ట్టేవారు. చిరంజీవి లాంటి హీరోతో సుమ‌న్ కు పోటీ ఉండేది. క‌రాటే లో బ్లాక్ బెల్ట్ అందంలో ఆక‌ట్టుకునే విధంగా ఉండ‌టంతో సుమ‌న్ అతిత‌క్కువ‌కాలంలో త‌న‌కంటూ మంచి గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు. 1959, ఆగస్టు 28న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన సుమన్.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150 సినిమాలకు పైగా హీరోగా నటించారు. తెలుగులో హీరోల్లో మొట్టమొదటిగా కరాటే బెల్ట్ సాధించింది ఆయనే. […]

  2. […] AP Power Cuts: ఏపీలో కరెంట్ కష్టాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించారు. అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి కాకపోవడంతో కోతలు అనివార్యమయ్యాయి. మరోవైపు ఎండలు ముదురుతుండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. వ్యవసాయం పంపు సెట్లకు కూడా తగినంతగా విద్యుత్ సరఫరా కావడం లేదు. పేరుకే ఉచిత విద్యుత్ కానీ.. ఏకధాటిగా గంటపాడు విద్యుత్ సరఫా చేయలేకపోతున్నారు. అటు చాలీచాలని విద్యుత్ ఉత్పత్తి, ఇటు మితిమీరిన వినియోగంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తప్పేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కనీస స్థాయికి పడిపోయింది. బొగ్గు సరఫరా లేని కారణంగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ప్రభుత్వం ముందస్తుగా పవర్ హాలీ డే ప్రకటించినా.. ఏ మంత ప్రయోజనం లేకపోతోంది. పరిశ్రమలకు నిలిపివేసిన విద్యుత్ ను గ్రుహ అవసరాలకు వినియోగిస్తున్నారు. గ్రుహాలకు కోతలు లేకుండా అందిస్తున్నారు. విద్యుత్ ను పొదుపువాడుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రజలను సూచించాయి. కానీ చాలా మంది విన్నపాన్ని పాటించడం లేదు. ఇళ్లో ఇష్టారాజ్యంగా ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్ లు వినియోగిస్తున్నారు. దీంతో ఇళ్లకు వాడే విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉంది. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించిన కారణంగా రోజుకు 20 మిలియన్ యూనిట్లు ఆదా అవుతోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular