Homeఆంధ్రప్రదేశ్‌Nagari Municipal Election Result: రోజా నగరిలో వైసిపి సత్తా చాటిందట.. నవ్వకండి ఇది సీరియస్...

Nagari Municipal Election Result: రోజా నగరిలో వైసిపి సత్తా చాటిందట.. నవ్వకండి ఇది సీరియస్ మేటర్..

Nagari Municipal Election Result:మీరు వంద మార్కులకు ఒక పరీక్ష రాశారు. ఒక వ్యక్తికి 90 మార్కులు వచ్చాయి. మరో వ్యక్తికి 30 మార్కులు మాత్రమే వచ్చాయి. ఇలాంటప్పుడు టాపర్ ఎవరో అవుతారు.. అదేంటి ఇది కూడా ఒక ప్రశ్నేనా.. 90 మార్కులు వచ్చినవాడే కదా టాపరు అయ్యేది.. కానీ వైసీపీ పరిభాషలో 30 మార్కులు వచ్చినవాడే టాపర్.. ఇదేంటి ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా.. మిగతా వారికి ఏమో గాని.. వారికి సాధ్యమే. వారి […]

Nagari Municipal Election Result:మీరు వంద మార్కులకు ఒక పరీక్ష రాశారు. ఒక వ్యక్తికి 90 మార్కులు వచ్చాయి. మరో వ్యక్తికి 30 మార్కులు మాత్రమే వచ్చాయి. ఇలాంటప్పుడు టాపర్ ఎవరో అవుతారు.. అదేంటి ఇది కూడా ఒక ప్రశ్నేనా.. 90 మార్కులు వచ్చినవాడే కదా టాపరు అయ్యేది.. కానీ వైసీపీ పరిభాషలో 30 మార్కులు వచ్చినవాడే టాపర్.. ఇదేంటి ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా.. మిగతా వారికి ఏమో గాని.. వారికి సాధ్యమే. వారి సొంత మీడియాలో మరింత సాధ్యమే.

ఏపీ రాష్ట్రంలో జరిగిన పురపాలకం ఎన్నికల్లో నవంబర్ 3న ఫలితాలు బయటికి వచ్చాయి. ఈ ఎన్నికల్లో కూటమి జోరు చూపించింది. వైసిపికి ఏమాత్రం అవకాశం లేకుండా చేసింది. ప్రతి మున్సిపాలిటీలో తిరుగులేని విజయాన్ని అందుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూసుకుంటే ఓటు బ్యాంకును మరింత పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదు.. స్థానిక ఎన్నికల్లో కూడా తమకు తిరుగులేదని మరోసారి చాటిచెప్పింది.

స్థానిక ఎన్నికల్లో జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగిరింది. దాదాపు పులివెందుల మున్సిపాలిటీలో ఇంతవరకు టిడిపి గెలిచింది లేదు. అప్పుడెప్పుడో 1995లో జెడ్పిటిసి స్థానాన్ని దక్కించుకుంది. మళ్లీ ఇటీవల కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో జడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పులివెందుల స్థానాన్ని టిడిపి గెలుచుకుంటుందని ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. కానీ ఇక్కడ టిడిపి ఏకంగా వైసీపీని మూడు వార్డులకు మాత్రమే పరిమితం చేసింది. ఇక పులివెందుల తర్వాత ఏపీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తిని కలిగించిన స్థానం నగరి. ఈ ప్రాంతంలో మాజీ మంత్రి రోజా గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. టిడిపి మీద విమర్శలు చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. అయితే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 40 వార్డులకు టిడిపి 30 గెలిచింది. వైసిపి ఎనిమిది.. స్థానాలు గెలిచింది.

వాస్తవానికి ఇక్కడ మున్సిపల్ పీఠాన్ని టిడిపి గెలుచుకుంటే.. వైసిపి కవరింగ్ మాత్రం మరో విధంగా ఉంది. వైసిపి మౌత్ పీస్ సాక్షిలో అయితే జర్నలిజం సిగ్గుపడే విధంగా వార్తలు రాశారు. టిడిపి పీఠాన్ని దక్కించుకుంది అని రాయడం కంటే.. నగరిలో వైసీపీ అభ్యర్థులు దుమ్మురేపారని.. అదరగొట్టారని రాస్కొచ్చింది. 2021లో మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో అప్పట్లో నగరిలో 29 వార్డులకు వైసిపి 24 గెలిచింది. టిడిపి నాలుగు స్థానాలు దక్కించుకుంది. ఇప్పుడు టిడిపి ఏకంగా ఆ సంఖ్యను 30 కి పెంచుకుంది. వైసిపి 21 స్థానాలను కోల్పోయింది. ఇంత జరిగినప్పటికీ వైసీపీ తనకు తాను సెల్ఫ్ విక్టరీ ఇచ్చుకోవడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper