Homeఎంటర్టైన్మెంట్Telugu Cinema Exhibitors Issue: ఎగ్జిబ్యూటర్స్ నుంచి మొదలైన గొడవ ప్రొడ్యూసర్స్ వరకు వచ్చిందా..?

Telugu Cinema Exhibitors Issue: ఎగ్జిబ్యూటర్స్ నుంచి మొదలైన గొడవ ప్రొడ్యూసర్స్ వరకు వచ్చిందా..?

Telugu Cinema Exhibitors Issue: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్లు ఎంతో కష్టపడుతుంటారు. ఆ సినిమా ఆడితే దానిమీద వచ్చే ప్రాఫిట్స్ తో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు సినిమా మీద ఒక వ్యాపారాన్ని చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా సినిమా బాగుంటే అందరు బాగుంటారు. సినిమా తేడా కొడితే మాత్రం ప్రతి ఒక్కరు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోకతప్పదు. ముఖ్యంగా థియేటర్ యజమానులు ఆ విషయంలో చాలావరకు […]

Telugu Cinema Exhibitors Issue: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్లు ఎంతో కష్టపడుతుంటారు. ఆ సినిమా ఆడితే దానిమీద వచ్చే ప్రాఫిట్స్ తో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు సినిమా మీద ఒక వ్యాపారాన్ని చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా సినిమా బాగుంటే అందరు బాగుంటారు. సినిమా తేడా కొడితే మాత్రం ప్రతి ఒక్కరు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోకతప్పదు. ముఖ్యంగా థియేటర్ యజమానులు ఆ విషయంలో చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిజానికి వీళ్ళు ఇలాంటి కష్టాలు వచ్చినా కూడా సినిమాని రన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. సింగిల్ స్క్రీన్ ఎగ్జిబ్యూటర్లు మాత్రం సినిమాల ద్వారా నష్టాలు వస్తున్నాయంటూ సింగిల్ స్క్రీన్స్ ను ఈ నెల చివరి నుంచి క్లోజ్ చేస్తున్నాం అంటూ ఒక ప్రకటన చేశారు. దాంతో ప్రొడ్యూసర్లందరు రంగంలోకి దిగారు. సింగిల్ స్క్రీన్స్ కి రేంటెడ్ విధానంలో డబ్బులను చెల్లిస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం పర్సంటేజ్ ల రూపంలోనే డబ్బులు చెల్లిస్తే థియేటర్లను నడుపుకోవడానికి బాగుంటుందని భావిస్తున్నారు. ఎగ్జిబ్యూటర్ల సైడ్ దిల్ రాజు లాంటి నిర్మాత ఉండగా, వాళ్లకు వ్యతిరేకంగా మైత్రి రవి, సితార నాగ వంశీ ఉన్నారు. నిజానికి సింగిల్ స్క్రీన్స్ లో సినిమా ని చూసినప్పుడే ఆ సినిమాలు ఎక్కువ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాయి.

మల్టీప్లెక్స్ లో సినిమాలు చూసిన కూడా అంతటి కిక్ రాకపోవచ్చు. దానివల్ల సింగల్ స్క్రీన్స్ ను బతికించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఆ సినిమాకు సంబంధించిన వేడుకలన్ని సింగిల్ స్క్రీన్స్ లోనే జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి సందర్భంలో సింగిల్ స్క్రీన్ ను మూసేస్తే సినిమా మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉంటాయి.

ఇప్పటికీ సింగిల్ స్క్రీన్ లలో సినిమాను చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం అయినా వాటిని బతికించాల్సిన అవసరమైతే ఉందని చాలామంది భావిస్తున్నారు. ఇక ఎగ్జిబ్యూటర్ల నుంచి మొదలైన ఈ గొడవ ప్రొడ్యూసర్ల వరకు చేరుకుంది. వాళ్ళు ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకునే స్థాయికి వెళ్లిపోయింది.

ఇక ఈ సిచువేషన్ వల్ల ప్రొడ్యూసర్ల మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఇప్పటికే దిల్ రాజుకి మైత్రి వాళ్ళకి మధ్య కొంచెం డిస్టెన్స్ ఏర్పడింది. ఇక ఇప్పుడు దిల్ రాజు కి నాగ వంశీ మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఈ విషయం మీద ఎలాంటి డిసీజన్స్ తీసుకుంటారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper