Eshwar Sai Viral Video: ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి.. తన సహచర ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీరిద్దరూ వేములవాడలో ఒక హోటల్లో ఉండగా ఈశ్వర్ సాయి భార్య పట్టుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఈ వ్యవహారం తెలుగు మీడియాలో సంచలనంగా మారింది. ఇటీవల ఈశ్వర్ సాయి బాసింగ బలాలు అనే పాట ద్వారా ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. ఈ పాట కంటే ముందు అనేక పాటల్లో అతడు నటించాడు. అతడికి జంటగా మాధురి రాథోడ్ నటించింది. వీరిద్దరికి సూపర్ ఫెయిర్ అనే గుర్తింపు ఉండేది. అయితే ఈశ్వర్ సాయికి ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మాధురి రాథోడ్ ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉండేది. మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మారింది. అప్పట్లో ఆమెకు బ్రేకప్ అయినప్పుడు ఈశ్వర్ సాయి భార్య ఓదార్చింది. ఇదే సమయంలో మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయిని ముగ్గులోకి దించిందని
.. అతనితో వివాహేతర సంబంధం మొదలుపెట్టిందని ఈశ్వర్ సాయి భార్య ఆరోపిస్తోంది.
“నా భర్త చాలా మంచోడు. అతడికి ఎటువంటి అలవాట్లు లేవు. మా ఇద్దరికి వివాహం జరిగి ఏడు సంవత్సరాలు అవుతోంది. కనీసం నా భర్త మద్యం కూడా తాగడు. మాధురి రాథోడ్ కి బ్రేకప్ అయిన తర్వాత నేను దగ్గరుండి ఓదార్చాను. నా పక్కనే ఉంటూ ఇలా మోసం చేస్తోందని కలలో కూడా ఊహించలేదు. నా కళ్ళ ముందే ఉండేది. మంచి అమ్మాయి అనుకున్నాను. కానీ నా భర్తకు పెట్టిన మెసేజ్లు చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాను. ఈ వ్యవహారంలో ఒకసారి నా కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. నా భర్త చాలా మంచోడు. కానీ అమ్మాయి అలా మీద పడితే ఏం చేస్తాడు.. ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదని” ఈశ్వర్ సాయి భార్య వ్యాఖ్యానించింది.
మాధురి రాథోడ్ కు గతంలోనే ఒక వ్యక్తితో రిలేషన్ ఉండేది. ఈ వ్యవహారం ఈశ్వర్ సాయికి కూడా తెలుసు. అయితే వారిద్దరికీ బ్రేకప్ కావడంతో ఈశ్వర్ సాయి భార్య మాధురి రాథోడ్ ను ఓదార్చింది. తన భర్త తో కలిసి నటించే విధంగా అవకాశాలు కూడా ఇచ్చింది. చివరికి మాధురి రాథోడ్ ఇలా చేసింది. దీంతో ఈశ్వర్ సాయి భార్య కన్నీటి పర్యంతమవుతోంది. తన సంసారాన్ని మాధురి రాథోడ్ నాశనం చేసిందని విలపిస్తోంది.
నా భర్త మంచోడే.. ఆమెనే మీద పడి లొంగదీసుకుంది
మాకు పెళ్లయి 7 ఏళ్లు అవుతుంది. నా భర్త కనీసం మందు కూడా తాగడు
ఈ అమ్మాయికి బ్రేకప్ అయితే నేనే దగ్గరుండి ఓదార్చాను
నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తుందని అనుకోలేదు
నా కళ్ల ముందే ఉండేది. మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ మెసేజ్లు చూసి… https://t.co/LYMjCGNmQL pic.twitter.com/dAaYN5Qka7
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026