Homeఎంటర్టైన్మెంట్Eeshwar Sai And Madhuri Rathod: అర్ధరాత్రి భార్యకు అడ్డంగా దొరికిన ఫోక్ సాంగ్ ఆర్టిస్టులు.....

Eeshwar Sai And Madhuri Rathod: అర్ధరాత్రి భార్యకు అడ్డంగా దొరికిన ఫోక్ సాంగ్ ఆర్టిస్టులు.. వైరల్ వీడియో

Eeshwar Sai And Madhuri Rathod: గత కొంతకాలంగా యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. సినిమా పాటలు కంటే ఈ పాటలే ఎక్కువగా వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఫోక్ సాంగ్స్ పాడే వారిని సెలబ్రిటీలను చేస్తున్నాయి. రాము రాథోడ్.. మంగ్లీ.. మధుప్రియ.. జాను లిరి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఫోక్ సాంగ్స్ పాడినవారు.. ఫోక్ సాంగ్స్ కు స్టెప్పులు వేసినవారు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. రాము రాథోడ్ ఏకంగా బిగ్ బాస్ సీజన్ 9 లో […]

Eeshwar Sai And Madhuri Rathod: గత కొంతకాలంగా యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. సినిమా పాటలు కంటే ఈ పాటలే ఎక్కువగా వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఫోక్ సాంగ్స్ పాడే వారిని సెలబ్రిటీలను చేస్తున్నాయి. రాము రాథోడ్.. మంగ్లీ.. మధుప్రియ.. జాను లిరి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఫోక్ సాంగ్స్ పాడినవారు.. ఫోక్ సాంగ్స్ కు స్టెప్పులు వేసినవారు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. రాము రాథోడ్ ఏకంగా బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీ హోదాలో అడుగుపెట్టారు.

ఇటీవల ప్రమీల అనే పేరుతో ఒక ఫోక్ సాంగ్ విడుదలైంది. ఈ పాట సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ఈ పాటలో మాధురి రాథోడ్.. ఈశ్వర్ సాయి లీడ్ రోల్ లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో సన్న సన్న బియ్యమే, సిటీ చీర, కళ్యాణి జరగావే.. ఫోను లేకున్నా వంటి జానపద గీతాలలో నటించారు. ఈశ్వర్ సాయి ఇటీవల నటించిన బాసింగ బలాలు పాట యూట్యూబ్లో సంచలనం కలిగించింది. రికార్డు స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంటూ అదరగొడుతోంది.

ఈశ్వర్ సాయి ఈ పాట ద్వారా సెలబ్రిటీ అయిపోయాడు. తాజాగా ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలో ఒక హోటల్లో గది తీసుకున్నారు. వారిద్దరు అందులో సరస సల్లాపాలు ఆడటం మొదలుపెట్టారు. కొంతకాలంగా ఈశ్వర్ సాయి తనను దూరం పెట్టడంతో అనుమానం పెంచుకుంది. అతడి కదలికల మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టింది. చివరికి ఆమె ఊహించిందే నిజమైంది. ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ తో వ్యవహారం సాగిస్తున్నట్టు తేలింది. వేములవాడలో వీరిద్దరూ ఉంటున్న హోటల్ కు వెళ్లిన ఈశ్వర్ సాయి భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అక్కడితోనే ఈశ్వర్ సాయి భార్య ఆగిపోలేదు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఈశ్వర్ సాయికి గతంలోని వివాహం జరిగింది.. ఫోక్ సాంగ్స్ ద్వారా ఒక్కసారి ఆయన ఫేమస్ కావడంతో సెలబ్రిటీ అయిపోయాడు. మాధురి రాథోడ్ తో అనేక గీతాలలో నటించడం నేపథ్యంలో ఆమెతో సన్నిహిత సంబంధం కొనసాగించడం మొదలుపెట్టాడు. అయితే ఈశ్వర్ సాయి వ్యవహారం అనేక అనుమానాలకు తావు ఇచ్చే విధంగా ఉండడంతో అతడి భార్య నిఘా పెట్టింది. చివరికి ఆమె ఊహించిందే జరిగింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మీద వేములవాడ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper