Youtuber Nandana: ప్రముఖ యూట్యూబర్ నందన ని ఇబ్రహీం పట్నం పోలీసులు నిన్న శంషాబాద్ విమానాశ్రయం లో అరెస్ట్ చేసిన ఘటన ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉద్యోగాలు ఇప్పిస్తామనే ఆశ చూపించి లక్షల రూపాయిలు దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈమెపై ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రాంతాల నుండి కేసులు నమోదు అయ్యాయి. ఇంత కాలం ఈమె UK లో ఉండడం వల్ల పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఆమె ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు ఇండియా కి తిరిగి వచ్చింది. విమానాశ్రయం లో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఈమెని అడ్డుకొని , పోలీసులకు సమాచారం ఇవ్వగా , వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ కేసు కి సంబంధించిన పూర్తి వివరాలు క్లుప్తంగా ఈ స్టోరీ లో మనం చూడబోతున్నాం.
నవంబర్ 22 , 2025 వ సంవత్సరం లో ఈమెపై క్రాంతి కుమార్ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు. ఈ కేసు లో ఆమె భర్త మధుకర్ ని A1 ముద్దాయిగా పరిగణించగా, నందన ని A2 గా పరిగణించారు. ఇక ఆమె మామయ్య (మధుకర్ తండ్రి) A3 గా ఉన్నారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే క్రాంతి కుమార్ సతీమణి వీసా ని పోస్ట్ స్టడీ వర్క్ నుండి , టయర్ 2 వీసా కి మార్చడం కోసం, అదే విధంగా సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇప్పిస్తామని చెప్పారని కేసు లో పేర్కొన్నాడు. అయితే ‘అగడ్ సొల్యూషన్’ అనే కంపెనీ నుండి మధుకర్ ఒక నకిలీ సర్టిఫికెట్ ఇప్పించాడని చెప్పుకొచ్చారు. ఈ కేసు ని పోలీసులు BNS 3184RW పీనల్ కోడ్ సెక్షన్ క్రింద నమోదు చేశారు.
ఇకపోతే వీసా అప్ గ్రేడ్ కోసం దాదాపుగా 14 లక్షల 75 వేల రూపాయిలు క్రాంతి కుమార్ పంపాడట. ఎప్పుడైతే వర్క్ ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదని అర్థం చేసుకున్నారో , తమ డబ్బుని తిరిగి ఇవ్వమని అడిగారట. అలా వాళ్ళు ఒత్తిడి చేయడం వల్ల 2 లక్షల రూపాయిలు తిరిగి ఇచ్చారట, ఇంకా దాదాపుగా 12 లక్షల 75 వేల రూపాయిలు ఇవ్వాల్సి ఉందట. అయితే ఇబ్రహీం పట్నం పోలీసులకు నందన మెయిల్ చేస్తూ ‘నేను విచారణకు హాజరు అవుతాను , దయచేసి నాపై వేసిన లుకౌట్ నోటీసులు ఎత్తివేయండి ‘ అని కోరిందట. కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదని , చట్ట రీత్యా అలాంటివి కుదరవని చెప్పారట. నిన్న పోలీసులు ఈమె ని విచారించి వదిలేశారు. త్వరలోనే ఆమె భర్త మధుకర్ కూడా హైదరాబాద్ కి రాబోతున్నది. ఈయన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడానికి సిద్ధం అవుతున్నారు.