Homeఎంటర్టైన్మెంట్Rashmi Gautam: రష్మీ గౌతమ్ కి ఆ వ్యసనం ఉందా..? కలవరపెడుతున్న ఫోటోలు!

Rashmi Gautam: రష్మీ గౌతమ్ కి ఆ వ్యసనం ఉందా..? కలవరపెడుతున్న ఫోటోలు!

Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ స్టార్ హీరోయిన్స్ రేంజ్ పాపులారిటీ అనుభవిస్తుంది. నటిగా కెరీర్ ప్రారంభించిన రష్మీ ప్రస్తుతం టాప్ యాంకర్ లో ఒకరిగా ఉన్నారు. జబర్దస్త్ షో వేదికగా గ్లామరస్ యాంకర్ అనే గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు రాకపోయినా కూడా తన అందం, క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దశాబ్దకాలంగా బుల్లితెర పై హవా సాగిస్తుంది. జబర్దస్త్ పర్మినెంట్ యాంకర్ గా రష్మీ ఫిక్స్ అయిపోయింది. పలు షోలు, స్పెషల్ ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ ఈటీవీకే పరిమితం అయ్యింది.

కాగా రష్మీ తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి ఫారెన్ చెక్కేసింది. ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. రష్మీ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతి విషయం ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా ఫారెన్ లో రష్మీ పర్యటించిన ప్రదేశాల్లో దిగిన రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ నేపథ్యంలో లేటెస్ట్ ఫొటోలో వైన్ బాటిల్ కి ముద్దు పెడుతూ కనిపిస్తుంది. అంతేకాదు అమితానందం లో వైన్ బాటిల్ కి హగ్గులు ఇచ్చింది. పెగ్గేస్తూ రష్మీ ఇచ్చిన పోజులు చర్చకు దారి తీశాయి. రష్మీ గౌతమ్ కి మద్యం అలవాటు ఉందని, ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక రష్మీ కేవలం యాంకరింగ్ మాత్రమే కాదు నటిగా కూడా రాణిస్తుంది. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తుంది. పలు సినిమాల్లో రష్మీ నటించినప్పటికీ ఆమెకు బ్రేక్ రాలేదు.

యాంకర్ అనసూయ మాదిరిగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఎక్కువగా టీవీ షోస్ పైనే ఫోకస్ పెట్టింది. బుల్లితెరపై సందడి చేస్తుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు చేస్తుంది. సదరు రెండు షోలు మంచి టీఆర్పీలు రాబడుతున్నాయి. అక్కడ హవా మొత్తం రష్మీ గౌతమ్ దే అని చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

RELATED ARTICLES

Most Popular