spot_img
Homeఎంటర్టైన్మెంట్Arundhati Child Artist: ‘అరుంధతి’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత అందంగా మారిపోయిందేంటి?

Arundhati Child Artist: ‘అరుంధతి’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత అందంగా మారిపోయిందేంటి?

Arundhati Child Artist: టాలీవుడ్ కు చెందిన కొందరు హీరోయిన్లు అందచందాలతో నే కాకుండా యాక్షన్ మూవీస్ లో కూడా నటించి మెప్పించారు. అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నుంచి నేటి అనుష్క వరకు అన్ని కేటగిరీల్లో నూ నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగు, తమిళ్ లో అగ్ర హీరోలందరితో నటించి ఆల్ టైం సక్సెస్ హీరోయిన్ అనిపించుకున్నారు అనుష్క. ఆమె కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అలా మొదటిసారిగా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ‘అరుంధతి’లో నటించి అలరించింది. ఈ సినిమాలో అనుష్క చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించిన ఓ అమ్మాయి కూడా అంతే స్థాయిలో అలరించింది. గంభీరమైన కళ్లతో పాటు ఆ వయసులోనే తన నట బీభత్సాన్ని సృష్టించింది. మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా?

‘అరుంధతి’ సినిమాలో అనుష్క చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించిన అమ్మాయి పేరు దివ్య నాగేష్. ఈమె 1988 ఏప్రిల్ 13లో కేరళలోని అలప్పుజ లో జన్మించింది. ఆ తరువాత వీరి కుటుంబం ముంబయికి మారింది. 2014లో ‘సేవమ్ ’ అనే తమిళ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఈమె నటనను మెచ్చుకున్న కోడి రామకృష్ణ ‘అరుంధతి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో దివ్య నాగేష్ తన నటనతో అబ్బురపరిచింది. రియల్ గా రాజకుటుంబానికి చెందిన అమ్మాయిలు ఇలాగే ఉంటారా? అన్నట్లు గా నటించింది.

ఇలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు పలు అడ్వర్టయిజ్మెంట్ లో నటించింది. అయితే దివ్య నాగేశ్ చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు కంటే మలయాళంలో నే ఎక్కువగా నటించింది. కొన్ని సంవత్సరాల పాటు చదువుపై దృష్టి పెట్టిన ఆమె ఆ తరువాత రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాలో హీరోయిన్ గా మొదటిసారిగా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోక పోవడంతో అమ్మడుకు గుర్తింపు రాలేదు.

తెలుగులో అవకాశాలు రాకపోవడంతో దివ్య నాగేష్ తమిళ ఇండస్ట్రీ కి వెళ్లారు. అక్కడ కొన్ని సినిమాల్లో నటించారు. మొదట్లో సాంప్రదాయంగా నటించిన ఈమె ఆ తరువాత కాస్త హాట్ హీరోయిన్ గా మారారు. అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. కొన్ని సినిమాలో గ్లామరస్ గా కనిపించడంతో ఆమెకు ఫాలోవర్స్ పెరిగాయి. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంతో సౌమ్యంగా ఉన్న ఆమె ఇప్పుడు గ్లామర్ భామగా మారిపోయారు.

ఇక సోషల్ మీడియాలో దివ్య నాగేష్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.డిఫరెంట్ ఫోజులు పెడుతూ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంత అందంగా ఉన్న దివ్య నాగేష్ కు అవకాశాలు ఎందుకు రావడం లేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే దివ్య నాగేష్ మాత్రం ఎక్కువగా తమిళ ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సొంత ఇండస్ట్రీ మలయాళంలోనూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Instant Telugu (@instanttelugu)

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Oktelugu Epaper