spot_img
Homeఎంటర్టైన్మెంట్Jason Sanjay: డైరెక్టర్ గా తొలి సినిమాకి హీరో విజయ్ కొడుకు ఎంత రెమ్యూనరేషన్...

Jason Sanjay: డైరెక్టర్ గా తొలి సినిమాకి హీరో విజయ్ కొడుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా? ఇది అన్యాయంగా అనిపించట్లేదా!

Jason Sanjay: తమిళంలో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పరంగా నెంబర్ 1 హీరో ఎవరంటే, ప్రతీ ఒక్కరు కామం గా చెప్పే పేరు ఇళయ దళపతి విజయ్. ఓపెనింగ్స్ రికార్డ్స్ తీసుకున్నా, క్లోజింగ్ రికార్డ్స్ తీసుకున్నా, టాప్ 10 లో 6 నుండి 7 సినిమాలు ఈయనవే ఉంటాయి. ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కి తమిళనాడు లో ఈ రేంజ్ డామినేషన్ ఉండేది. ఇప్పుడు ఆయన స్థానంలోకి విజయ్ వచ్చి కూర్చున్నాడు. అయితే రీసెంట్ గానే ఆయన రాజకీయ అరంగేట్రం చేసాడు. 2026 వ సంవత్సరం లో జరగబోయే తమిళనాడు సార్వత్రిక ఎన్నికలలో ఈయన పార్టీ పోటీ చేయబోతుంది. ప్రస్తుతం ఆయన నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ తమిళ రీమేక్ లో నటించబోతున్నాడు. H వినోద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పాత్రని పూజా హెగ్డే చేస్తుండగా, శ్రీలీల క్యారక్టర్ ని ప్రేమలు హీరోయిన్ ‘మామితా బైజు’ చేస్తుంది.

ఇదే విజయ్ చివరి సినిమా. ఈయనకి జేసన్ సంజయ్ అనే కుమారుడు ఉన్నాడు. ఈయన కూడా సినిమాల్లోకి హీరో గా నటించేంత వయస్సుకి వచ్చేసాడు. సాధారణంగా ఏ స్టార్ హీరో కొడుకు అయినా వెండితెర అరంగేట్రం హీరో గా చేయాలనీ కోరుకుంటారు. కానీ జేసన్ సంజయ్ మాత్రం డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన తొలిసినిమాలో హీరోగా మన టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ తో పాటు, లైకా ప్రొడక్షన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియో ని కాసేపటి క్రితమే విడుదల చేయగా, దానికి విజయ్ అభిమానుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. లోకేష్ కనకరాజ్ తన ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు ఎలా అయితే కాన్సెప్ట్ వీడియో ని విడుదల చేస్తాడో, అలా ఈ సినిమా కాన్సెప్ట్ ని కూడా ఈ వీడియో ద్వారా తెలియచేసాడు జేసన్ సంజయ్.

విజయ్ లాంటి సూపర్ స్టార్ కొడుకు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో, తమిళనాట ఈ సినిమా విపరీతమైన హైప్ తో విడుదల కాబోతుంది. కాబట్టి సందీప్ కిషన్ కి తమిళనాడు లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ఈ సినిమా ద్వారా దక్కనుంది. అయితే ఈ చిత్రానికి జేసన్ సంజయ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ సందీప్ కిషన్ కంటే మూడు రెట్లు ఉంటుందట. సందీప్ కిషన్ ఈ చిత్రంలో హీరో గా నటిస్తున్నందుకు 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంటే, సంజయ్ ఏకంగా 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. మొదటి సినిమాకే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం ఎంతవరకు న్యాయం అని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి కారణం సంజయ్ కదా, అలాంటప్పుడు ఆయన ఆ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడంలో తప్పేమి ఉంది అంటూ విజయ్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper