spot_img
Homeఎంటర్టైన్మెంట్Yatra 2 : యాత్ర 2.. వెండితెరపై జగన్ బయోపిక్

Yatra 2 : యాత్ర 2.. వెండితెరపై జగన్ బయోపిక్

Yatra 2 : తెలుగునాట రాజకీయ నాయకుల బయోపిక్ చిత్రాల ట్రెండ్ ఏనాడో ప్రారంభమైంది. కొన్నిచిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లనే రాబెట్టాయి. మరికొన్ని చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లేవి. అప్పట్లో దర్శకుడు దాసరి నారాయణరావు పొలిటికల్ సెటైరికల్స్ చిత్రాలు తీసేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చాలా చిత్రాలు తీశారు. కానీ గత ఎన్నికల ముందు నాటి నుంచి నాయకుల బయోపిక్ చిత్రాలు తీయడం ప్రారంభమైంది. 2019 ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను దర్శకుడు మహి వి.రాఘవన్ తీశారు. రాజశేఖర్ రెడ్డి పాత్రలతో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మెప్పించారు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా యాత్ర2కు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆర్జీవీ వ్యూహం సిద్ధం..
ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ సెటైరికల్ సినిమాకు సిద్ధపడుతున్నారు. గత కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. దానికి వ్యూహం అన్న పేరును ఖరారు చేశారు. ప్రధానంగా జగన్ ను టార్గెట్ చేస్తూ రాజకీయ ప్రత్యర్థుల పన్నిన వ్యూహాలను హైలెట్ చేస్తూ చిత్రం నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా వర్కవుట్ చేసేందుకు ఇప్పటికే ఆర్జీవీ తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. అయితే నెలలు గడుస్తున్నా ఈ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. బహుశా ఎన్నికలకు కొద్దినెలల ముందే విడుదల చేస్తే దాని ప్రభావం ఉంటుందని భావిస్తున్నట్ట సమాచారం.

దానికి కొనసాగింపుగా..
ఇంతలో యాత్ర2 కు మహి వి.రాఘవన్ సిద్ధపడుతున్నట్టు సమాచారం.  యాత్ర2 కొనసాగింపులో ఏపీ సీఎం జగన్ పాత్రే కీలకంగా పెట్టనున్నట్టు సమాచారం. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన కీలక పరిణామాల నుంచి జగన్ పొలిటికల్ ఎంట్రీ, తరువాత పాదయాత్ర, ఆపై అధికారం చేపట్టడం, సంక్షేమ పథకాలు.. ఇలా అన్నింటినీ ఫోకస్ చేస్తూ సినిమా చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. జగన్ పాత్రలో తమిళ నటుడు, రంగం చిత్రం ఫేమ్  జీవా ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్క్రిప్టు కూడా సిద్దం అయిందని సమాచారం.  అయితే దీనిపై కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది, చిత్ర యూనిట్ నుంచి ప్రత్యేక ప్రకటన రానుంది.

జీవం పోసిన మమ్ముట్టి..
యాత్ర సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రకు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. మమ్ముట్టి నటనే యాత్ర సినిమా విజయానికి ప్రధాన కారణం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచెకట్టు, హవాభావాలతో న్యూలుక్ తేవడంలో మమ్ముట్టి ఎంతగానో కష్టపడ్డారు. అయితే ఇప్పుడు జగన్ పాత్రను జీవా ఎంతవరకు మెప్పిస్తాడన్నది ప్రశ్న. అయితే జగన్ పాత్రకు జీవా న్యాయం చేస్తాడని దర్శకుడు మహీ వి రాఘవ బలంగా నమ్ముతున్నారు. జగన్ బయోపిక్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌ జులై నుంచి మొదలవనున్నట్లు తెలిసింది. ‘యాత్ర2’ సినిమాలో ఎక్కువగా జగన్ పాదయాత్రను హైలైట్ చేయనున్నారు. జీవాకు లుక్ టెస్ట్ చేసి జగన్ పాత్రకు తగిన నటుడో.. కాదో.. తేల్చిన తరువాత ఈ సినిమాతో పాటుగా నటీ నటులకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper