Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మామూలు ఊపులో లేడనే విషయం అందరికీ తెలిసిందే, ఆయన హీరో గా నటించిన గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి, దానికి తోడు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం కూడా మంచి సక్సెస్ అయ్యింది.ఇలా ఆయన ముట్టుకున్న ప్రతీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం తో బాలయ్యలో మునుపెన్నడూ లేని జోష్ కనిపిస్తుంది.
ఇది ఇలా ఉండగా ఆయన తండ్రి ఎన్టీఆర్ శత దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఖతార్ దోహా ప్రాంతం లో శుక్రవారం నాడు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథి గా హాజరయ్యాడు.అయితే అక్కడికి వచ్చిన అభిమానులందరూ బాలయ్య ని ఒక పాట పాడమని నినాదాలు చెయ్యగా, బాలయ్య మరోసారి తన గాత్రాన్ని సవరించుకొని ఒక పాట పాడాడు.
ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘జగదేకవీరుని కథ’ సినిమాలోని శివశంకరీ అనే పాటని పాడారు. ఈ పాటకి అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ,సోషల్ మీడియా లో మాత్రం ఈ వీడియో ని అప్లోడ్ చేసి నెటిజెన్స్ తెగ ట్రోల్ల్స్ చేసేస్తున్నారు, గతం లో కూడా బాలయ్య ‘మేము సైతం’ ఈవెంట్ లో పాడిన ఒక పాట ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది.
నెటిజెన్స్ ఈ వీడియో ని షేర్ చేస్తూ తెగ నవ్వుకునే వాళ్ళు.ఇప్పుడు లేటెస్ట్ గా బాలయ్య పాడిన శివశంకర పాటని ట్రోల్ చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతుంది, ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల బాలయ్య కి కూతురుగా నటిస్తుంది.
Standing ovation for #Balakrishna singing live in Doha yesterday. My friend Dr. Suresh, an ophthalmologist in Doha sent this.
Couldn’t believe my ears. Amazing transformation.
Only for Telugu followers please. pic.twitter.com/0kni5j6Q4k
— Dr. Mukharjee Madivada (@drmssm) May 6, 2023