Abdul Kalam
Abdul Kalam : ఇండియన్ సినీ ఇండస్ట్రీ లో బయోపిక్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కరెక్ట్ గా తీయాలే కానీ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతుంటాయి. కానీ అన్ని బయోపిక్స్ సూపర్ హిట్స్ గా నిలుస్తాయనే గ్యారంటీ లేదు. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం, సావిత్రి జీవితం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంది కాబట్టే. ఎంత ఎత్తుపల్లాలను చూసిందో, అంతే దుర్లభమైన జీవితాన్ని కూడా చూసింది. ప్రతీ ప్రేక్షకుడికి ఆమె జీవితం కనెక్ట్ అయ్యింది, అందుకే అంత పెద్ద హిట్ అయ్యింది. అదే విధంగా క్రికెటర్ MS ధోని బయోపిక్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బయోపిక్స్ కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి.
కానీ ముఖ్యమంత్రులుగా పని చేసిన సినీ నటులు ఎన్టీఆర్(NTR), ఎంజీఆర్ బయోపిక్స్ మాత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో కేవలం వాళ్ళు సాధించిన విజయాలను మాత్రమే చూపించారు, జీవితం లో ఎదురుకున్న ఒడిదుడుకులను చూపించలేదు. అందుకే అవి కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ఇలా కొన్ని బయోపిక్స్ ఫ్లాప్స్ అవ్వడం తో దర్శక నిర్మాతలు కొంతకాలం వీటికి బ్రేక్ ఇచ్చారు. కానీ హీరో ధనుష్(Dhanush K Raja) మాత్రం చాలా ధైర్యం చేసి బయోపిక్స్ చేయడానికి ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఆయన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన అబ్దుల్ కలాం(Apj Abdul Kalam) బయోపిక్ లో నటించబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసాడు. అబ్దుల్ కలాం లాంటి లెజెండ్ జీవిత చరిత్ర గురించి నేటి తరం యువత తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేయాలని అనుకోవడం గొప్ప ఆలోచనతో కూడుకున్న సాహసం అనే చెప్పాలి.
Also Read : అంతటి కలాం కన్నీరు పెట్టుకున్నాడు… చీఫ్ మార్షల్ కన్నీరు తుడిచాడు
ఈ చిత్రానికి ‘కలాం – ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ‘ఆదిపురుష్’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తీసిన ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించబోతున్నాడు అనే విషయం తెలిసిన వెంటనే నెటిజెన్స్ మండిపడ్డారు. అసలు ఇతను రామాయణం నే మార్చి ఇష్టమొచ్చినట్టు తీసాడు. అలాంటి వ్యక్తి మన దేశం గర్వించే అబ్దుల్ కలాం స్టోరీ ని ఎలా డీల్ చేస్తాడో అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. కానీ ఓంరౌత్ ఆదిపురుష్ కి ముందు ‘తానాజీ’ అనే చిత్రం చేసాడు. ఇది కూడా బయోపిక్, చాలా అద్భుతంగా తీసాడు. కాబట్టి ఈ చిత్రాన్ని కూడా కచ్చితంగా బాగా తీస్తాడనే నమ్మకం ఉందంటూ బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో ఓం రౌత్ తనని తాను ఎలా నిరూపించుకుంటాడు అనేది.
DHANUSH IN & AS DR APJ ABDUL KALAM – BIOPIC ANNOUNCED AT CANNES… OM RAUT TO DIRECT… #NationalAward-winning actor #Dhanush will portray the title role in #Kalam, a biopic on #BharatRatna Dr #APJAbdulKalam, the 11th President of India.
Directed by #OmRaut, the film is produced… pic.twitter.com/9hGEzZ5gFl
— taran adarsh (@taran_adarsh) May 21, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Dhanush in the abdul kalam biopic