Homeఎంటర్టైన్మెంట్Renu Desai: మెగాస్టార్ తో రేణు దేశాయ్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ పోస్ట్..

Renu Desai: మెగాస్టార్ తో రేణు దేశాయ్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ పోస్ట్..

Renu Desai: సోషల్ మీడియా నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీస్ లో ఒకరు రేణు దేశాయ్. హీరోయిన్ గా, మోడల్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా, ఈమెకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి గా నెటిజెన్స్ లో బాగా గుర్తింపు ఉంది. అయితే సోషల్ మీడియా లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచినప్పుడు ఒక సెక్షన్ ఆడియన్స్ ఈమెపై తీవ్రమైన నెగెటివిటీ చూపించడం వంటివి గతంలో మనం చాలానే […]

Renu Desai: సోషల్ మీడియా నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీస్ లో ఒకరు రేణు దేశాయ్. హీరోయిన్ గా, మోడల్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా, ఈమెకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి గా నెటిజెన్స్ లో బాగా గుర్తింపు ఉంది. అయితే సోషల్ మీడియా లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచినప్పుడు ఒక సెక్షన్ ఆడియన్స్ ఈమెపై తీవ్రమైన నెగెటివిటీ చూపించడం వంటివి గతంలో మనం చాలానే చూశాము . అందుకు రేణు దేశాయ్ చాలా అసహనానికి గురి అవుతూ ఉండేది. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో తన పోస్టులకు కామెంట్ సెక్షన్ బ్లాక్ చేసింది. ఇకపోతే నేడు మెగాస్టార్ తో కలిసి దిగిన ఒక ఫోటోని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. మెగాస్టార్ అంటే మన టాలీవుడ్ మెగాస్టార్ కాదు , మలయాళం మెగాస్టార్ మమ్ముటి.

ఆయన్ని షూటింగ్ సెట్స్ లో కలిసిన సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ ‘ఇది నాకు ఒక క్రేజీ ఫ్యాన్ మూమెంట్ అని చెప్పొచ్చు. మమ్ముటి లాంటి లెజెండ్ తో కాస్త సమయం గడిపినా నా జన్మ ధన్యం అవుతుంది , ఒక్కసారైనా ఈ మూమెంట్ వస్తే బాగుండును అని నా జీవితం లో ఒక కోరిక ఉండేది , అది నేటితో నిజమైంది. ఆయన లాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తిని నా జీవితం లో ఇప్పటి వరకు కలవలేదు’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె వ్యాఖ్యలకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మాకు కూడా మీలాటి అదృష్టం దొరికి ఉండుంటే బాగుండేది అంటూ మమ్మూటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper