Samantha – Naga Chaitanya: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. తనకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు అప్లోడ్ చెయ్యడమే కాకుండా,ఆ క్షణం లో తన ఆలోచనల్లో ఏదైతే ఉంటుందో, అది ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పుకొచ్చే సమంత, లేటెస్ట్ గా చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆమె షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఏముందంటే ‘మనం ఎప్పటికీ ఒక్కటే. కానీ ఈగోలు, అపనమ్మకాలు మరియు భయాలు మనల్ని వేరు చేస్తుంది’ అని ఉంది. ఇది కచ్చితంగా నాగ చైతన్య ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ లాగ స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ సమయం లో నాగచైతన్య సమంత గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో సమంత ప్రస్తావన వచ్చినప్పుడు చాలా పాజిటివ్ గా స్పందించాడు.

సమంత చాలా మంచి అమ్మాయి అని, ఆమె ఎక్కడున్నా సంతోషం గా ఉండాలనే కోరుకుంటానని, కానీ సోషల్ మీడియా లో రోజుకో వార్త మా మధ్య పుట్టిస్తున్నారు, అందువల్ల మా మధ్య మరింత దూరం పెరిగింది కానీ ఒకరిపై ఒకరికి గౌరవం ఇప్పటికీ అలాగే ఉంది అని చెప్పుకొచ్చాడు. దానికి రియాక్షన్ గా సమంత ఈ ట్వీట్ వేసినట్టు అర్థం అవుతుంది.
అంతే కాదు తన జీవితం లో సవాళ్లు ఎదురైనప్పుడు ఎలా ఉన్నానో చెప్పడానికి ఒక వీడియో ని షేర్ చేసి ఫన్నీ గా చెప్పే ప్రయత్నం చేసింది.ప్రస్తుతం ఆమె ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సిరీస్ తో పాటుగా విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ అనే చిత్రం లో నటిస్తుంది.ఈ ఏడాదిలోనే ఈ రెండు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.