Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. థియేటర్లలో ఆయన సినిమాలను చూసిన ప్రతి ఒక్కరు కాలర్ ఎగరేసుకొని మరి బయటికి వస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. డిజాస్టర్ సినిమాలకు సైతం భారీ కలెక్షన్స్ రాబట్టగలిగే కెపాసిటి తన ఒక్కడికే ఉందని చాలా సార్లు ప్రూవ్ చేశాడు. అలాంటి పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు సైతం అభిమానులుగా ఉన్నారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడితే వారిని కొట్టేసే అభిమానులు కూడా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో ఎదురుగా కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతుంటే ఆ హీరో చూడలేక వాళ్లను కొట్టేశారట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే తనిష్ కావడం విశేషం…
చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను మొదలు పెట్టిన ఆయన చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘నచ్చావులే’ సినిమాతో హీరోగా మారిన తను రమేష్ వర్మ దర్శకత్వంలో ‘రైడ్’ సినిమా చేశాడు. కెరియర్ మొదట్లో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత కాలంలో పెద్దగా సక్సెస్ లను సాధించలేకపోయాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉన్నాడు. తను హీరోగా మారిన తర్వాత ఆయన ఎదుట పవన్ కళ్యాణ్ గురించి కొంతమంది బ్యాడ్ గా మాట్లాడితే వాళ్ళను డైరెక్ట్ గా కొట్టేసాడంట. ఆ తర్వాత వాళ్ళు తమ తప్పు తెలుసుకుని తనీష్ కి సారీ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం తను సినిమాలేమీ లేకుండా ఖాళీగా ఉన్నాడు. అలాగే జనసేన పార్టీ తెలంగాణ వింగ్ లో ఆయన చాలా క్రియాశీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ సినిమాలు లేకపోవడం చాలావరకు ఇబ్బందిని కలిగించే విషయమనే చెప్పాలి…ఇక రాజకీయ రంగంలో ఆయన రాణిస్తాడా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…