Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంట డిమోన్ పవన్(Demon Pavan), రీతూ చౌదరి(Ritu Chowdary). మొదట్లో వీళ్లిద్దరి లవ్ ట్రాక్ ఆడియన్స్ కి చాలా చిరాకు కలిగించింది. ఇదేమి టార్చర్ రా బాబు అని సోషల్ మీడియా లో అడ్డమైన బూతులు తిట్టేవారు. కానీ ఎప్పటి నుండి అయితే వీళ్లిద్దరు నిజాయితీగా ఒకసారి కోసం ఒకరు నిలబడ్డారో, అప్పటి నుండి వీళ్లిద్దరు ఆడియన్స్ మనసులను దోచుకోవడం మొదలు పెట్టారు. వీళ్ళు కేవలం కంటెంట్ కోసమే ఇదంతా చేస్తున్నారు, బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వారిదే అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అదే రేంజ్ రిలేషన్ ని మైంటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గానే ఈ జంట కలిసి ‘BB జోడి 2’ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
రేపటి ఎపిసోడ్ లో వీళ్లిద్దరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఈ జంట కచ్చితంగా ఈ షోలో దుమ్ము లేపేస్తుందని అంతా అనుకున్నారు కానీ, అది జరగలేదు. చాలా యావరేజ్ రేంజ్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను, అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ జోడి రేపు ప్రసారం అవ్వబోయే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’, అదే విధంగా త్వరలోనే ప్రసారం అవ్వబోయే ‘BB ఉత్సవం’ ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొనబోతున్నారు. రేపు ప్రసారం అవ్వబోయే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ ఎపిసోడ్ లో రీతూ చౌదరి డిమోన్ పవన్ ని పువ్వు ఇచ్చి మరీ ప్రపోజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన ప్రోమో ని మీరు క్రింద చూడవచ్చు. అదే విధంగా ‘BB ఉత్సవం’ ప్రోగ్రాం లో కూడా వీళ్లిద్దరు ఇదే తరహా రిలేషన్ తో ఉన్నారు.
పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎవరిని చేసుకుంటావు అంటూ యాంకర్ శ్రీముఖి రీతూ చౌదరి ని అడగ్గా, అందుకు రీతూ క్షణం కూడా ఆలోచించకుండా డిమోన్ పవన్ పేరు చెప్తుంది. చూస్తుంటే వీళ్లిద్దరి మధ్య నిజంగానే లవ్ స్టోరీ నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీతూ చౌదరి కి గతం లో ఒక పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమె విడిపోయింది. మళ్లీ ప్రేమ, పెళ్లి జోలికి పోను అంటూ చెప్పుకొచ్చిన రీతూ చౌదరి, ఇప్పుడు నిజంగానే డిమోన్ పవన్ తో ప్రేమలో పడినట్టుగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో వీళ్లిద్దరి రిలేషన్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.