Dhanush Yellamma: కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి. మరి కొన్ని సినిమాలు ప్రేక్షకుల్లోని ఎమోషన్స్ ని బయటికి తీసే నిజ జీవితపు వాస్తవాలను తెలిసేలా చేస్తాయి. ఇక క్రమంలోనే వేణు ఎల్దండి చేసిన ‘బలగం’ సినిమా సైతం ప్రేక్షకుల్లో సెంటిమెంట్ ను ఎమోషన్ ని బయటికి తీసి వందలు బంధుత్వాలు అంటే ఏంటి అనేది తెలిసేలా చేసింది. మొత్తానికైతే ఈ సినిమాతో తను నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ఎల్లమ్మ’ అనే ఒక స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరతను చేస్తున్న ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూ ఉండటం విశేషం… రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మొదట చాలామంది హీరోలను అనుకున్నప్పటికి చివరికి దేవి శ్రీ ప్రసాద్ తో ఈ సినిమా చేయడం వెనక గల కారణం ఏంటి అంటే ఇందులో ఉన్న కొన్ని డిఫరెంట్ షేడ్స్ లో నటించడానికి కొంతమంది హీరోలు ఆసక్తి చూపించలేదట…
దానివల్ల ఈ సినిమా దేవిశ్రీప్రసాద్ తో చేయాల్సి వచ్చిందంటూ నిర్మాత దిల్ రాజు పలు సందర్భంలో క్లారిటి ఇచ్చాడు. ఇక ఇలాంటి సినిమాలో ధనుష్ చేస్తే బాగుండేది కదా అని మరి కొంత మంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి మొదటి ధనుష్ ను కూడా ఈ సినిమాలో హీరోగా తీసుకోవాలని అనుకున్నప్పటికి అది కార్యరూపం దాల్చలేదు.
నిజానికి ధనుష్ అయితే ఇలాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు చేశారు. కాబట్టి అతనికి ఆ పాత్రల పట్ల ఒక క్లారిటీ ఉంది. అలాంటి ఒక పర్ఫామెన్స్ ని అలవోకగా చేసి మెప్పించగలిగే సామర్థ్యం కూడా తనకు ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ నుంచి వేణు ఎల్దండి ఎలాంటి నటనను బయటకు తీస్తాడు. ఈ సినిమాతో దేవిశ్రీప్రసాద్ హీరోగా సెటిలైపోతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…