Homeఎంటర్టైన్మెంట్Devarakonda Rashmika Wedding: విజయ్ దేవరకొండ - రష్మిక ల పెళ్లి విషయం ఇన్ని రోజులు...

Devarakonda Rashmika Wedding: విజయ్ దేవరకొండ – రష్మిక ల పెళ్లి విషయం ఇన్ని రోజులు దాచడానికి గల కారణం అదేనా..?

Devarakonda Rashmika Wedding: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో ‘విజయ్ దేవరకొండ’… ఈ సినిమాతో ఓవర్ నైట్లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ తర్వాత ‘గీతా గోవిందం’ సినిమాతో మరో సక్సెస్ ను సాధించాడు. ఇక అప్పటినుంచి టైర్ వన్ హీరోగా మారతాడని ప్రతి ఒక్కరు అనుకున్నప్పటికి ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకోవడంతో టైర్ వన్ హీరో పొజిషన్ ని చేరుకోలేకపోయాడు… ప్రస్తుతం చేస్తున్న […]

Devarakonda Rashmika Wedding: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో ‘విజయ్ దేవరకొండ’… ఈ సినిమాతో ఓవర్ నైట్లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ తర్వాత ‘గీతా గోవిందం’ సినిమాతో మరో సక్సెస్ ను సాధించాడు. ఇక అప్పటినుంచి టైర్ వన్ హీరోగా మారతాడని ప్రతి ఒక్కరు అనుకున్నప్పటికి ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకోవడంతో టైర్ వన్ హీరో పొజిషన్ ని చేరుకోలేకపోయాడు… ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించి ఎలాగైనా సరే టైర్ వన్ హీరోగా మారడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన్’, ‘రణబలి’ లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో రష్మిక కి విజయ్ దేవరకొండ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్ళకి రహస్యంగా నిశ్చితార్థం కూడా అయింది అంటూ గతంలో చాలా వార్తలైతే వచ్చాయి. కానీ వీటి మీద ఇటు విజయ్ కానీ, అటు రష్మిక గానీ ఎవరు స్పందించలేదు.

ఇక మొదటినుంచి కూడా ఫిబ్రవరి 26వ తేదీన వీళ్ళ పెళ్లి ఉండబోతుందంటూ కామెంట్స్ చేసినప్పటికి వీళ్లిద్దరు కూడా సైలెంట్ గా ఉండడంతో అది ఒక ఫేక్ న్యూస్ గా చాలామంది భావించారు. కానీ రీసెంట్ గా వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ని రివీల్ చేయడంతో వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రతి ఒక్కరికి క్లారిటి వచ్చింది.

ఈనెల 26వ తేదీన వీళ్లిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది…ఇక వీళ్లిద్దరు ఇన్ని రోజులపాటు తమ పెళ్ళికి సంబంధించిన విషయాలను హోల్డ్ లో పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే ఒకవేళ వీళ్ళు పెళ్లి చేసుకునే విషయాన్ని ముందుగానే చెప్పేస్తే మీడియా నుంచి గాని ప్రేక్షకుల నుంచి గాని అభిమానుల నుంచి గాని వీళ్ళ మీద కొన్ని ప్రెజర్స్ పడే అవకాశాలు ఉన్నాయట.

వాళ్ళు చేసే ప్రాజెక్టు మీద అంత పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశం ఉండకపోవచ్చని, అందువల్లే ఇన్ని రోజులపాటు ఈ విషయాన్ని దాచాల్సి వచ్చిందని ఇటు విజయ్, అటు రష్మిక ఇద్దరు క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరు ఇప్పటికే ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇక ఇప్పుడు మరోసారి ‘రణబలి’ సినిమాలో కలిసి కనిపించబోతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper