Homeఎంటర్టైన్మెంట్Sree Vishnu: ఏకంగా నాలుగు సినిమాల్లో శ్రీ విష్ణు.. మరో నాని కాబోతున్నాడా..

Sree Vishnu: ఏకంగా నాలుగు సినిమాల్లో శ్రీ విష్ణు.. మరో నాని కాబోతున్నాడా..

Sree Vishnu: మీడియం రేంజ్ హీరోల్లో మినిమం గ్యారంటీ రేంజ్ వసూళ్లను రాబట్టే హీరోల లిస్ట్ తీస్తే అందులో ఇప్పుడు శ్రీవిష్ణు(Sree Vishnu) కచ్చితంగా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేచురల్ స్టార్ నాని తన కెరీర్ ప్రారంభం లో ఎలా అయితే మినిమం రేంజ్ సినిమాలు చేస్తూ , తనకంటూ ఒక స్థిరమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడో, శ్రీవిష్ణు కూడా ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నాడు. ఆయన గత చిత్రం ‘విష్ణు విన్యాసం’ […]

Sree Vishnu: మీడియం రేంజ్ హీరోల్లో మినిమం గ్యారంటీ రేంజ్ వసూళ్లను రాబట్టే హీరోల లిస్ట్ తీస్తే అందులో ఇప్పుడు శ్రీవిష్ణు(Sree Vishnu) కచ్చితంగా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేచురల్ స్టార్ నాని తన కెరీర్ ప్రారంభం లో ఎలా అయితే మినిమం రేంజ్ సినిమాలు చేస్తూ , తనకంటూ ఒక స్థిరమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడో, శ్రీవిష్ణు కూడా ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నాడు. ఆయన గత చిత్రం ‘విష్ణు విన్యాసం’ కి యావరేజ్ రేంజ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిల్చింది. అదే విధంగా వారం గ్యాప్ లో విడుదలైన ‘మృత్యుంజయ్’ చిత్రానికి కూడా పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు , జెన్ జీ ఆడియన్స్ లో విష్ణు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేది.

ఇదంతా పక్కన పెడితే శ్రీ విష్ణు తన భవిష్యత్తు లైనప్ ని కూడా చాలా సాలిడ్ గా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతానికి ఆయన చేతుల్లో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘సన్నీ సంజయ్’ అనే చిత్రం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సగానికి పైగానే పూర్తి అయ్యింది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం మన ముందుకు రాబోతుంది. ఇక తనతో ‘సామజవరగమనా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన రామ్ అబ్బరాజు దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సమాంతరంగా శరవేగంగా సాగుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలను కూడా రీసెంట్ గానే ఆయన లాక్ చేసినట్టు తెలుస్తోంది. ‘మాస్ జాతర’ ఫేమ్ భాను భోగవరాజు తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట.

అదే విధంగా పవన్ బస్సంశెట్టి అనే నూతన డైరెక్టర్ తో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వగానే , కొత్తగా ఒప్పుకున్న ఈ రెండు సినిమాలను కూడా ఒకేసారి మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడట శ్రీ విష్ణు. ఇలా వరుసగా మినిమం గ్యారంటీ సినిమాలు చేస్తూ , నిర్మాతల పాలిట కల్ప వృక్షం లాగా శ్రీ విష్ణు మారిపోయాడని , అతని ఊపు చూస్తుంటే యంగ్ ఏజ్ రవితేజ , నాని గుర్తుకు వస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper