Homeహెల్త్‌Heart Healthy Fruits: ఈ మూడు రకాల పండ్లతో గుండె ఆరోగ్యం.. దీర్ఘాయుష్షు..!

Heart Healthy Fruits: ఈ మూడు రకాల పండ్లతో గుండె ఆరోగ్యం.. దీర్ఘాయుష్షు..!

Heart Healthy Fruits: మనం రోజూ తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండడానికి ప్రస్తుత రోజుల్లో ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిలో పండ్లు చాలా ముఖ్యమైనవి. ఫ్రూట్స్ లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అయితే గుండె ఆరోగ్యానికి ఏ పండ్లు తీసుకోవాలో తెలియక చాలా మంది అయోమయానికి గురవుతూ ఉంటారు. కొన్ని అధ్యయనలాల ప్రకారం ఈ మూడు […]

Heart Healthy Fruits: మనం రోజూ తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండడానికి ప్రస్తుత రోజుల్లో ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిలో పండ్లు చాలా ముఖ్యమైనవి. ఫ్రూట్స్ లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అయితే గుండె ఆరోగ్యానికి ఏ పండ్లు తీసుకోవాలో తెలియక చాలా మంది అయోమయానికి గురవుతూ ఉంటారు. కొన్ని అధ్యయనలాల ప్రకారం ఈ మూడు రకాల ఫ్రూట్స్ క్రమం తప్పకుండా ఉంటే గుండె సమస్యలు రాకుండా ఉండాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ పండ్లు ఏవో చూద్దాం..

బ్లూబెర్రీస్:
బ్లూబెర్రీస్‌ మార్కెట్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. వీటిని చాలా మంది చూస్తూ వెళ్తారు. కానీ కొనడానికి ఇష్టపడరు. కానీ ఇందులో ఆంథోసైనిన్స్ అనే సహజ మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవే బ్లూబెర్రీస్‌కు నీలం లేదా ఊదా రంగును ఇస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండటంతో శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతాయి. అలాగే రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. అందువల్ల బ్లూ బెర్రీస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుందని కొన్నిఅధ్యయనాల్లో పేర్కొన్నారు.

ఆపిల్:
రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు.. అనే సామెత ఉన్న విషయం తెలిసిందే. అంటే ఆపిల్‌లో ఎటువంటి పోషకాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇందులో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. రోజుకు ఒక మీడియం ఆపిల్ ను తింటే కొలెస్ట్రాల్ రాకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

నారింజ:
నారింజ ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైనది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫ్లేవనాయిడ్లు వంటి పోషకాలు ఉంటాయి. విటమిన్ సి శరీరంలోని యాంటీఆక్సిడెంట్ రక్షణకు తోడ్పడుతుంది. పొటాషియం సరైన స్థాయిలో తీసుకోవడం రక్తపోటు నియంత్రణకు సహాయపడవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper