Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' లో ప్రాణ స్నేహితుల మధ్య వైరం!

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో ప్రాణ స్నేహితుల మధ్య వైరం!

Bigg Boss 10 Telugu:  బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య స్నేహం ఆరంభం నుండి చివరి వరకు కొనసాగడం చాలా కష్టం. ఎందుకంటే బిగ్ బాస్ చాలా క్లిష్టమైన పరిస్థితులను కంటెస్టెంట్స్ కి కలిగిస్తూ ఉంటాడు. వాటిని ఎదురుకొని నిలబడి ముందుకు వెళ్లే సమయం లో స్నేహితుల మధ్య విబేధాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతే కాదు , భద్ర శత్రువులుగా కొనసాగిన కంటెస్టెంట్స్ ని కూడా కొన్ని పరిస్థితులు స్నేహితులను చేస్తాయి. ఇలాంటి పరిస్థితులు […]

Bigg Boss 10 Telugu:  బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య స్నేహం ఆరంభం నుండి చివరి వరకు కొనసాగడం చాలా కష్టం. ఎందుకంటే బిగ్ బాస్ చాలా క్లిష్టమైన పరిస్థితులను కంటెస్టెంట్స్ కి కలిగిస్తూ ఉంటాడు. వాటిని ఎదురుకొని నిలబడి ముందుకు వెళ్లే సమయం లో స్నేహితుల మధ్య విబేధాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతే కాదు , భద్ర శత్రువులుగా కొనసాగిన కంటెస్టెంట్స్ ని కూడా కొన్ని పరిస్థితులు స్నేహితులను చేస్తాయి. ఇలాంటి పరిస్థితులు గత సీజన్స్ లో ఆరంభం నుండి ఉండేవి కాదు, 6 వ వారం లేదా 8 వ వారం లో ఎదురయ్యేవి. కానీ ‘బిగ్ బాస్ 10’ హౌస్ లో రెండవ రోజే ఇలాంటి పరిస్థితులను క్రియేట్ చేసాడు బిగ్ బాస్. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న హాట్ స్టార్ లైవ్ లో ఒక టాస్క్ జరిగింది.

ఈ టాస్క్ ని నేటి ఎపిసోడ్ లో మనం చూడొచ్చు. హౌస్ లోని కంటెస్టెంట్స్, రెండు బ్లూ, రెడ్ టీమ్స్ గా విడిపోయారు. బ్లూ టీం కి లీడర్ గా రామ్ ప్రసాద్ ఎంపిక కాగా, రెడ్ టీం కి కెప్టెన్ గా రోహిత్ ఎంపికయ్యాడు. మీ సొంత టీమ్స్ లో ఎవరో ఒకరిని హై రిస్క్ లో పెట్టాల్సిందిగా చెప్తాడు బిగ్ బాస్. బ్లూ టీం నుండి రామ్ ప్రసాద్ ‘మీరంతా నన్ను లీడర్ గా ఎంచుకున్నారు, నేనే హై రిస్క్ లోకి వెళ్తాను. ఏదైనా సమస్య వస్తే , మీ పవర్స్ ని ఉపయోగించి నన్ను సేవ్ చేయండి’ అని అంటాడు. అదే విధంగా రెడ్ టీం లో ఝాన్సీ , చైత్ర, వంశీ ముందుగా చర్చించుకొని చరణ్ , షాలిని పేర్లు చెప్తారు. ఆ తర్వాత రోహిత్, అమన్, శ్రేష్టి లు చర్చించుకొని చరణ్ పేరు చెప్తారు.

ఎక్కువ శాతం ఓట్లు చరణ్ కి రావడం తో , అతన్ని హై రిస్క్ లో పెడుతారు. చరణ్, రోహిత్ మంచి స్నేహితులు అవ్వడం తో , రోహిత్ చరణ్ పేరు ని చెప్పాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడడం తో బాగా ఎమోషనల్ అయిపోతాడు. బిగ్ బాస్ స్నేహితుల మధ్య వైరం క్రియేట్ చేయడానికి ఈ టాస్క్ పెట్టాడు, కానీ రెండు గ్రూప్స్ లో కూడా స్నేహితుల మధ్య వైరం క్రియేట్ అవ్వలేదు. అయితే వర్షిణి మాత్రం రోహిత్ , అమన్ లపై చరణ్ కి లేనిపోనివి చెప్పి , గొడవలు క్రియేట్ చేయడానికి చూసింది. ఇది గమనించిన రోహిత్ , చరణ్ ని దగ్గరకు పిలిచి , జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి వైరం ఏర్పడలేదు. భవిష్యత్తులో ఇలాగే ఉంటుందని చెప్పలేము. ఎదో ఒక క్షణం లో స్నేహితుల మధ్య గొడవలు ఏర్పడొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper