AI+ Nova 2 power 5G: మనదేశంలో స్మార్ట్ఫోన్ మార్కెట్ విలువ లక్షల కోట్లు ఉంటుంది. ఎన్ని కంపెనీలు ఉన్నా.. ఎన్ని మోడల్స్ సందడి చేస్తున్నా.. కొత్త కంపెనీలు వస్తూనే ఉన్నాయి. కొత్త మోడల్స్ మార్కెట్ లోకి తీసుకొస్తూనే ఉన్నాయి. అటువంటి మోడల్ ఇప్పుడు వచ్చింది. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో సంచలనం కలిగించేందుకు సిద్ధమైంది.
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జి పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల కాబోతోంది. ఈ ఫోన్ ను ఈ కంపెనీ నేరుగా మార్కెట్లోకి తీసుకురాకుండా ప్రాజెక్టు ఓపెన్ రివ్యూ 2.0 ప్రోగ్రాం ద్వారా టెక్ నిపుణులు.. ఎథికల్ హ్యాకర్లు.. రివ్యూవర్లకు ముందుగానే అందించి.. పరీక్షలు చేపడుతోంది.
ఈ ఫోన్ కు సంబంధించిన మైక్రో సైట్ ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ వేదిక అయిన ఫ్లిప్కార్ట్ లో లీక్ అయింది. అధికారిక టీజర్ల ప్రకారం ఈ ఫోన్లో ముఖ్యమైన ఫీచర్లు చాలానే ఉన్నాయి. వాస్తవానికి ప్రస్తుతం యంగ్ జనరేషన్ కోరుకున్న ఫీచర్లను మొత్తం ఇందులో ఈ కంపెనీ ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో అద్భుతమైన సదుపాయాలు కల్పించి.. బలమైన మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ కంపెనీ ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.
ఫీచర్లను పరిశీలిస్తే..
ఇందులో ప్రాసెసర్ మీడియా టెక్ డైమన్ సిటీ చిప్సెట్ తో పని చేస్తూ ఉంటుంది.
ఈ ఫోన్ కు అత్యంత ప్రధాన బలం బ్యాటరీ. ఇందులో 7000 ఎం ఏ హెచ్ అతిపెద్ద బ్యాటరీ ఉంది. 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో గోల్డ్ వేరియంట్ లో ఉన్న రెడ్ పవర్ బటన్ యాక్సిడెంట్ ఉంది. ఇది బ్లూ ఫ్యూజన్.. గోల్డెన్ బ్లూ ఫ్యూజన్.. డీప్ పర్పల్.. మిడ్ నైట్ బ్లాక్.. ఓషన్ గ్రీన్ వంటి ఐదు రంగుల్లో లభిస్తోంది.
ఇందులో రెండు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. 6 జిబి రామ్ ప్లస్ 128gb.. 8 జిబి రామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్లలో లభిస్తోంది.
ఇందులో ఆండ్రాయిడ్ బేస్డ్ ఎన్ ఎక్స్ టి క్యూ ఓఎస్ మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది. అయితే ఈ ఫోన్ కు సంబంధించి అధికారిక విడుదల తేదీ.. ఖచ్చితమైన ధర బయటికి వెలువడలేదు. అయితే ఇదే చిప్ సెట్ కలిగి ఉన్న క్రితం మోడల్ ఏ ఐ ప్లస్ నోవా 2 సూపర్ ప్రో ధర 17, 999 రూపాయలుగా ఉంది. ఇక ఈ ఫోన్ ధర కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది.
ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ రేంజిలో ఫోన్ రూపొందించి.. మిడిల్ మార్కెట్ మొత్తాన్ని దక్కించుకోవాలని ఈ కంపెనీ భావిస్తోంది. అందువల్లే మోడల్ నాణ్యతలో ఏమాత్రం రాజీ పడలేదు. పైగా బ్యాటరీ.. ఫోన్ పని చేసే విధానం అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఫోన్ అధికారికంగా మార్కెట్లోకి త్వరలోనే విడుదలవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు