Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: నిఖిల్ పై లేనిపోని నిందలు వేసిన యష్మీ..మాట్లాడినవి మొత్తం పచ్చి...

Bigg Boss Telugu 8: నిఖిల్ పై లేనిపోని నిందలు వేసిన యష్మీ..మాట్లాడినవి మొత్తం పచ్చి అబద్దాలే!

యష్మీ నిజంగా నువ్వు కట్ చేసావా అని అడగగా, దానికి నిఖిల్ సమాధానం చెప్తూ నీ గురించి కాదు, సీత గురించి చెప్తున్నా అని అంటాడు. యష్మీ తో కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు నేను నా మీద అంచనాలు పెట్టుకోకు అని చెప్పాను, కేవలం స్నేహితులు లాగ మాత్రమే ఉందామని చెప్పాను అని అంటాడు నిఖిల్. దానికి యష్మీ సమాధానం చెప్తూ 'నువ్వు స్నేహితుడిగా కూడా సరిగా ఉండలేదు నిఖిల్.

Bigg Boss Telugu 8: నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ఒక స్పెషల్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సీజన్ లో ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్స్ ని మళ్ళీ హౌస్ లోపలకు పిలిచి,వాళ్ళతో నామినేషన్ చేయించి బయటకి పంపే ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచనకు సెల్యూట్ చేయాల్సిందే. ముందుగా సోనియా వచ్చి నిఖిల్, ప్రేరణ ని నామినేట్ చేసి వెళ్తుంది. నిఖిల్ కి నువ్వు ఎప్పుడూ నామినేషన్స్ చేసేటప్పుడు సరైన పాయింట్స్ తో చెయ్యవు అనే ఒక కారణంతో నామినేట్ చేయగా, యష్మీ తో రిలేషన్స్ పట్ల నిఖిల్ ఆమెకి క్లారిటీ ఇవ్వకుండా రిలేషన్ ని ముందుకు నడిపించే విషయం పై నామినేట్ చేయడం హైలైట్ గా నిల్చింది. నా మీద ఆ అమ్మాయికి ఫీలింగ్స్ ఉన్నప్పుడు నేను ఆమెతో కట్ చేశాను కదా అని అంటాడు నిఖిల్.

అప్పుడు యష్మీ నిజంగా నువ్వు కట్ చేసావా అని అడగగా, దానికి నిఖిల్ సమాధానం చెప్తూ నీ గురించి కాదు, సీత గురించి చెప్తున్నా అని అంటాడు. యష్మీ తో కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు నేను నా మీద అంచనాలు పెట్టుకోకు అని చెప్పాను, కేవలం స్నేహితులు లాగ మాత్రమే ఉందామని చెప్పాను అని అంటాడు నిఖిల్. దానికి యష్మీ సమాధానం చెప్తూ ‘నువ్వు స్నేహితుడిగా కూడా సరిగా ఉండలేదు నిఖిల్. నీకు ఇష్టం ఉండి, బయటకి చెప్పడానికి మొహమాటం పడుతున్నట్టు మిక్సెడ్ సిగ్నల్స్ ఇచ్చావు. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కేవలం నువ్వు నా డ్రీం లో వచ్చావ్ అనే విషయాన్నే చెప్పాను, నువ్వు నీ మనసులో ఏముందో కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీదనే చెప్పమని చెప్పాను, కానీ నువ్వు చెప్పలేదు’ అని అంటుంది.

ఇక్కడ యష్మీ తప్పు మొత్తం నిఖిల్ వైపు నెట్టే ప్రయత్నం చేసింది కానీ, ఆమెకి నిఖిల్ మీద ఫీలింగ్స్ లేవు అంటూ చెప్పడం ముమ్మాటికీ పచ్చి అబద్దమే. అతని వెనుక తిరగడం, ఫీలింగ్స్ ఉన్నట్టు మాట్లాడడం వంటి సందర్భాలు ఎన్నో మనం చూసాము. నిఖిల్ కి బయట కావ్య మ్యాటర్ గురించి యష్మీ కి తెలుసు, బయటకి వెళ్తే మళ్ళీ ఆమెతో ప్యాచప్ అవ్వాలని అనుకుంటున్నాడు అనే విషయం కూడా ఆమెకు ఎప్పుడో తెలుసు, అయినప్పటికీ కూడా యష్మీ అతని వెంట పడింది. అంతెందుకు సూర్య వచ్చినప్పుడు , ఆయన పాటలకు డ్యాన్స్ వేయమని కంటెస్టెంట్స్ కి చెప్పగా, రిహార్సల్స్ కి వెళ్ళేటప్పుడు విష్ణు, పృథ్వీ కలిసి డ్యాన్స్ వేయడానికి కంఫర్ట్ గా లేదని, విష్ణు జోడిలను మార్చమని చెప్పగా, బిగ్ బాస్ నిఖిల్, విష్ణు మరియు పృథ్వీ, యష్మీ డ్యాన్స్ వేయాల్సిందిగా ఆదేశిస్తాడు. దీనికి విష్ణు పై యష్మీ ఏ రేంజ్ లో విరుచుకుపడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నా సంతోషాన్ని చెడగొట్టావు అంటూ విష్ణు పై నిప్పులు చెరిగింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, జనాలు చూడట్లేదని యష్మీ అనుకుందేమో. ఈ ఒక్క సంఘటన పై ఆమె మాట్లాడిన పచ్చి అబద్దాలు ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు కారణం కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper